Asianet News TeluguAsianet News Telugu

‘సైతాన్’ వెబ్ సిరీస్ లో పచ్చి బూతులు.. స్పందించిన డైరెక్టర్ మహి వి రాఘవ్.. ఏమన్నారంటే.?

‘సేవ్ ది టైగర్’ తర్వాత దర్శకుడు మహి వి రాఘవ్ డైరెక్షన్ లో వస్తున్న సిరీస్ ‘సైతాన్’. రీసెంట్ గా దీని ట్రైలర్ విడుదలైంది. పచ్చి బూతులతో, బోల్డ్ సీన్స్ తో నింపేశారు. దీనిపై తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆయన స్పందించారు. 
 

Director Mahi V Raghav  Clarity about Shaitan Web Series Trailer NSK
Author
First Published Jun 8, 2023, 10:33 PM IST

పదేళ్లకు పైగా డైరెక్టర్ మహి వీ రాఘవ్ (Mahi V Raghav)  తెలుగు ఇండస్ట్రీలో యాక్టివ్ గా ఉంటున్నారు. ఆయన సినిమాలు ప్రేక్షకులకు కొత్తదనాన్ని చూపించారు. కామెడీ, రొమాంటిక్ డ్రామాలను తెరకెక్కించి అలరించారు. అలాగే వైఎస్సార్ జీవితం ఆధారం ‘యాత్ర’ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చి మంచి హిట్ అందుకున్నారు. ఇక ప్రస్తుతం ఓటీటీల హవా కొనసాగుతుంటడంతో దర్శకుడు మహి కూడా వెబ్ సిరీస్ లపై ఫోకస్ పెట్టారు. 

ఈ క్రమంలో రీసెంట్ గా ‘సేవ్ ది టైగర్స్‘ వెబ్ సిరీస్ తో సక్సెస్ అందుకున్నారు. మధ్య తరగతి భార్యభర్తల మధ్య జరిగే సన్నివేశాలతో సిరీస్ ను తీసుకొచ్చారు. కామెడీ, ఎమోషన్స్ తో ఆడియెన్స్ ను మెప్పించారు. ఈ సిరీస్ తర్వాత కాస్తా రూటు మార్చి క్రైమ్ జోనర్ లో ఓ సిరీస్ ను డైరెక్ట్ చేశారు. అదే ‘సైతాన్’ (Shaitan). ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫాం కోసం రూపొందించారు. 

తాజాగా సైతాన్ నుంచి ట్రైలర్ విడుదలైంది. పచ్చి బూతులు, బోల్డ్ సీన్స్ తో నింపేశారు. ఇప్పటికే ‘రానా నాయుడు’ సిరీస్ లో బూతులు వాడి సెన్సేషన్ గా మారిన విషయం తెలిసిందే. దాంతర్వాత ‘సైతాన్’ అంతకు మించిన బూతులతో సంచలనంగా మారింది. వయలెన్స్ కూడా బాగా ఉండటం.. మహి నుంచి ఇలాంటి సిరీస్ రావడంతో రకరకాలుగా చర్చ జరుగుతోంది. దీనిపై తాజాగా ఓ ఇంటర్వ్యూలో మహి వి రాఘవ్ క్లారిటీ ఇచ్చారు. 

మహి వీ రాఘవ్ మాట్లాడుతూ.. సైతాన్ సిరీస్ ఒక క్రైమ్ థ్రిల్ల‌ర్‌. దానిపై మూలాల్లోకి వెళ్లి రీసెర్చ్ చేశాం. ఓ క్రైమ్ చేసే వ్య‌క్తి శాంతంగా మాట్లాడ‌డు క‌దా.. అత‌ని చ‌ర్య‌లే కాదు.. మాట‌లు కూడా వ‌ల్గ‌ర్‌గా ఉంటాయి. మనిషి పరిణామం చెందుతూ ఉంటాడు. ఈక్రమంలో ఎమోషన్స్ కూడా మారుతుంటాయి. ఇందులో బూతులు లేవని చెప్పడం లేదు.. కానీ అక్కడ అవసరమై వాడం. దాన్ని నెగెటివ్ గా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఈ సిరీస్ చూసిన తర్వాత వయలెన్స్ కు దూరంగా ఉండాలనే భావన కూడా కలిగే అవకాశం ఉందనే కోణంలో ఆలోచించాలి. వచ్చే రిజల్ట్ ను బట్టి నెక్ట్స్ సీజన్ లో బూతులు తగ్గిస్తాం. 

డైరెక్టర్ గా, స్టోరీ టెల్లర్ గా అన్ని అంశాలను చూపించేలా ట్రైలర్ కట్ చేయించాను. వయలెన్స్ ఉందంటున్నారు. మనిషి మొదటి నుంచి వయలెన్స్ తో, ఘర్షణలతోనే ఎదిగాడు. అదే మనం చూపించే ప్రయత్నం చేశాం. ‘సైతాన్’ సిరీస్ మొదటి భాగమిది. మొత్తం తొమ్మిది ఎపిసోడ్ లు ఉంటాయి. దీని తర్వాత సోషల్ సెటైరికల్ గా ఓ సినిమా రాబోతుంది. దాంతర్వాత ‘యాత్ర2‘ ప్రారంభం అవుతుంది.ఇంకా స్క్రిప్ట్ వర్క్ నడుస్తోంది. ఇక ఈ సిరీస్ ఎలా ఉండబోతుందనేది చూడాలి. సిరీస్ మొత్తం ఓ పోలీసు హత్య గురించి నడుతుందని అర్థం అవుతోంది. ఇందులో రిషి, దేవయాని శర్మ, షెల్లీ, జాఫర్ ప్రధాన పాత్రలో నటించారు. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ నిర్మించింది. జూన్ 15 నుంచి స్ట్రీమింగ్ కానుంది. 

Follow Us:
Download App:
  • android
  • ios