కరోనా టాలీవుడ్ ని వెంటాడుతుంది. ఇప్పటికే చిరంజీవి, రాజమౌళి వంటి ప్రముఖులు కరోనా బారిన పడ్డారు. ఇటీవల చరణ్ కి కరోనా సోకడంతో క్వారంటైన్ అయ్యాడు. చరణ్ కుటుంబంతో కలిసి క్రిస్మస్ వేడుకలో పాల్గొన్నాడు. దీనితో వరుణ్ తేజ్ సైతం కరోనా బారినపడడం జరిగింది. తాజాగా డైరెక్టర్ క్రిష్ కి కరోనా సోకినట్లు తెలుస్తుంది. 

పవన్ కళ్యాణ్ షూటింగ్ కోసం సిద్దమవుతున్న ఆయనకు టెస్ట్స్ చేయగా కరోనా పాజిటివ్ అని తేలింది. పవన్ కళ్యాణ్ తో క్రిష్ ఓ పీరియాడిక్ యాక్షన్ డ్రామా తెరకెక్కిస్తున్నారు. లాక్ డౌన్ తరువాత ఈ మూవీ షూటింగ్ తిరిగి ప్రారంభించనున్నారు. వకీల్ సాబ్ షూటింగ్ ముగియడంతో పవన్ క్రిష్ మూవీకి సిద్ధం అవుతున్నాడు. షూటింగ్ కొరకు చిత్ర యూనిట్ సర్వం సిద్ధం చేశారు. జనవరి4 నుండి షూటింగ్ జరగాల్సివుండగా... ప్రభుత్వ నిబంధల ప్రకారం అందరికీ కరోనా టెస్ట్స్ నిర్వహించారు. 
ఈ క్రమంలో డైరెక్టర్ క్రిష్ కి కరోనా పాజిటివ్ రిజల్ట్ వచ్చాయట. 

దీనితో షాకైన చిత్ర యూనిట్ ఆయనను క్వారంటైన్ కి తరలించారట. ఎటువంటి లక్షణాలు లేకున్నప్పటికీ పృథ్వి కరోనా బారినపడడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. దీనితో ఈ చిత్ర షూటింగ్ కొంచెం ఆలస్యం కానుంది. కాగా యంగ్ హీరో వైష్ణవ్ తేజ్, రకుల్ జంటగా క్రిష్ ఓ మూవీ ఈ గ్యాప్ లో తెరకెక్కించారు.