ప్రముఖ డైరెక్టర్ హరీశ్ శంకర్ కు సంబంధించిన ‘ఏటీఎం’ వెబ్ సిరీస్ ఈరోజు ఘనంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా నిర్మాత దిల్ రాజు ఆధ్వర్యంలో పూజా కార్యక్రమం ముగిసింది.    

టాలీవుడ్ డైరెక్టర్ హరీశ్ శంకర్ (Harish Shankar) వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. గ్యాప్ లో తను ‘ఏటీఎం’ వెబ్ సిరీస్ కోసం స్క్రిప్టు కూడా రాశారు. దొంతనాల నేపథ్యంలో ఈ సిరీస్ కు చాలా మాస్ కంటెంట్ ను అందించారు హరీశ్ రావు. ఈ వెబ్ సిరీస్ ను దిల్ రాజ్ ప్రొడక్షన్ బ్యానర్ పై ప్రొడ్యూసర్ దిల్ రాజ్ నిర్మిస్తున్నారు. ఈ సందర్భంగా ATM Web Series పూజా కార్యక్రమాన్ని ఈరోజు ఘనంగా పూర్తి చేశారు. ఈ సిరీస్ కు సంబంధించిన మొదటి ఎపిసోడ్ ను చిత్రీకరణ ప్రారంభమైంది. రెగ్యూలర్ షూటింగ్ ఏప్రిల్ 27 నుంచి జరగనుంది. 

బిగ్ బాస్ ఫేమ్ సన్నీ ’(VJ Sunny) ఈ ప్రాజెక్ట్ లో ఉండటం పట్ల సిరీస్ పై మరింత ఆసక్తి నెలకొంది. మాస్ కంటెంట్ తో ఆడియెన్స్ ను ఎంటర్ టైన్ చేసేందుకు ‘ఏటీఎం’ చిత్రీకరణను త్వరగా పూర్తి చేయనున్నారు. దిల్ రాజు క్లాప్ కొట్టగా, హరీశ్ శంకర్ స్రిప్ట్ ను అందించారు. ఈ పూజా కార్యక్రమానికి వీజే సన్నీ, నటుడు సుబ్బరాజు, ప్రశాంత్ విహారి, హన్షిత రెడ్డి తదితరులు హాజరయ్యారు.

మరోవైపు హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) హీరోగా నటిస్తున్న ‘భవదీయుడు భగత్ సింగ్’ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి కావచ్చాయి. త్వరలో షూటింగ్ అప్డేట్ ను అందించేందుకు మేకర్స్ సిద్ధంగా ఉన్నారు. అయనంక బోస్ సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్న ఈ సినిమాకి ఆనంద్ సాయి ఆర్ట్ డైరెక్టర్గా పని చేయనున్నారు. "గబ్బర్ సింగ్" వంటి బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ కాంబినేషన్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న రెండవ సినిమా ఇది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తన అప్ కమింగ్ ఫిల్మ్ ‘హరి హర వీరమల్లు’ చిత్ర షూటింగ్ లో బిజీగా ఉన్నారు.

Scroll to load tweet…