నటుడు శ్రీరామ్, గ్లామర్ బ్యూటీ అవికా గోర్ (Avika Gor) జంటగా నటించిన చిత్రం ‘టెన్త్ క్లాస్ డైరీస్’. ఈ మూవీ రిలీజ్ కు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా హీరో శ్రీరామ్ సినిమాకు సంబంధించిన పలు విశేషాలను పంచుకున్నాడు.
హీరోయిన్ అవికా గోర్, శ్రీరామ్ ప్రధాన తారాగణంగా నటించిన చిత్రం ‘టెన్త్ క్లాస్ డైరీస్’ (Tenth Class Diaries). ఈ మూవీని ఎస్ఆర్ మూవీ మేకర్స్, అన్విత అవని క్రియేషన్స్ పతాకాలపై రూపొందిన చిత్రమిది. నిర్మాత అచ్యుత రామారావు .పి, రవితేజ మన్యం సంయుక్తంగా నిర్మించారు. అజయ్ మైసూర్ సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. జూన్ 24న ఈ చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు మేకర్స్ అన్ని విధాలా ప్లాన్ చేశారు. విడుదలకు ఇంకో పది రోజుల సమయమే ఉండటంతో ప్రస్తుతం చిత్ర ప్రచార కార్యక్రమాలను ప్రారంభించారు.
ఈ సందర్భంగా మీడియాతో ఇంటరాక్ట్ అయిన హీరో శ్రీరామ్ సినిమాకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ డిటేయిల్స్ ను రిలీజ్ చేశారు. ఇందులో అసలు సినిమా ఆయన వద్దకు ఎలా చేరిందనే విషయంపై అడిగిన ప్రశ్నకు ఊహించని విధంగా బదులిచ్చాడు. ఆయన మాట్లాడుతూ.. ‘టెన్త్ క్లాస్ డైరీస్’తో దర్శకుడిగా పరిచయమవుతున్న సినిమాటోగ్రాఫర్ అంజితో నాకు పరిచయం ఉంది. తమిళంలో నాతో ఒక ప్రాజెక్ట్ చేయాల్సింది. అప్పుడు నా డేట్స్ కుదరలేదు. అప్పుడు అంజితో ‘మీరు దర్శకుడిగా చేసే ఫస్ట్ ప్రాజెక్ట్ నా దగ్గరకు తీసుకు రావాలి’ అని చెప్పాను.
కొన్నాళ్లకు ఒక కథ ఉందని చెబితే... హైదరాబాద్ వచ్చి కలిశాను. అయితే ఇక్కడ చాలా ఆసక్తికర ఘటన జరిగింది. ఫర్ ఎ చేంజ్... దర్శకుడు కథ చెప్పలేదు. నిర్మాత అచ్యుత రామారావు గారే కథ చెప్పారు. ఆ తర్వాత తెలిసింది... ఆయనే కథ రాశారని! కథ విన్న వెంటనే 'మీ రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ ఏమైనా ఉన్నాయా?' అని అడిగా. అప్పుడు రామారావు ఎమోషనల్ అయ్యారు. మా బ్యాచ్ లో జరిగిందని చెప్పారు. ఆయన టెన్త్ బ్యాచ్ రీ యూనియన్ తర్వాత జరిగిన సంఘటనలే ఈ 'టెన్త్ క్లాస్ డైరీస్'గా రూపొందిందన్నారు. అయితే, కొంత ఫిక్షన్ ఉంది. సినిమాలో క్యారెక్టర్లు ఎవరో ఒకరు రిలేట్ చేసుకునేలా ఉంటాయి. ప్రతి ఒక్కరి జీవితంలో స్కూల్ డేస్ మెమొరబుల్ మూమెంట్స్. అటువంటి మూమెంట్స్ ను పిక్చరైజ్ చేశాం.
అలాగే హీరోయిన్ పాత్ర గురించి మాట్లాడుతూ.. చాందిని పాత్రలో అవికా గోర్ నటించారు. చాందిని కోసం అన్వేషించడమే సినిమా. ఎప్పుడు కలుస్తామో మీరు ఊహించుకోవచ్చని అన్నారు. అయితే ఈ చిత్రం 96కి దగ్గరగా ఉంటుందనే వార్తలను ఆయన ఖండించారు. రెండూ వేర్వేరు సినిమాలని బదులిచ్చారు. కానీ ఫ్లాష్ బ్యాక్ సీన్స్‌లో కొంత సిమిలారిటీస్ ఏమైనా ఉంటాయేమో చూడాలి. '96'కి ముందు 'నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమోరీస్' వచ్చింది. ఆ తర్వాత వచ్చిన 'ప్రేమమ్'లోనూ కొన్ని సిమిలారిటీస్ ఉంటాయని చెప్పొకొచ్చారు.
