`అమృతారామమ్` మూవీ రివ్యూ
గత నాలుగు రోజులుగా ప్రత్యక్షంగా ఆన్‌లైన్‌లో విడుదల చేయబడుతున్న మొట్టమొదటి తెలుగు చిత్రం అంటూ ఊదరకొడుతున్న సినిమా రిలీజైంది. మార్చి 25న ఉగాది సందర్భంగా రిలీజ్ చేయాలని ప్లాన్ చేసినా కరోనా వైరస్ కారణంగా అనివార్య పరిస్థితులు తలెత్తడంతో ఓటీటీ ప్లాట్ ఫాంలో రిలీజ్ అయ్యింది. అమృతారామం అనే టైటిల్ తో వచ్చిన ఈ చిత్రం జీ5 న ఈరోజు మన ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమాకు కేవలం డైరక్ట్ ఆన్ లైన్ లో రిలీజ్ చేయటమే ప్రత్యేకత తప్పించి, ఇంకేమైనా ఉందా...థియోటర్ లో రిలీజ్ అయితే ఏమన్నా కలిసొచ్చేదా లేక ఆన్ లైన్ లో రిలీజ్ చేయటమే ఈ సినిమాకు మంచిదైందా...సురేష్ బాబు వంటి స్టార్ ప్రొడ్యూసర్ ఈ సినిమాని రిలీజ్ చేయటానికి పూనుకోవటానికి ఉన్న స్పెషల్ కంటెంట్ ఏమిటో రివ్యూలో చూద్దాం.
గత నాలుగు రోజులుగా ప్రత్యక్షంగా ఆన్‌లైన్‌లో విడుదల చేయబడుతున్న మొట్టమొదటి తెలుగు చిత్రం అంటూ ఊదరకొడుతున్న సినిమా రిలీజైంది. మార్చి 25న ఉగాది సందర్భంగా రిలీజ్ చేయాలని ప్లాన్ చేసినా కరోనా వైరస్ కారణంగా అనివార్య పరిస్థితులు తలెత్తడంతో ఓటీటీ ప్లాట్ ఫాంలో రిలీజ్ అయ్యింది. అమృతారామం అనే టైటిల్ తో వచ్చిన ఈ చిత్రం జీ5 ద్వారా ఈరోజు మన ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమాకు కేవలం డైరక్ట్ ఆన్ లైన్ లో రిలీజ్ చేయటమే ప్రత్యేకత తప్పించి, ఇంకేమైనా ఉందా...థియోటర్ లో రిలీజ్ అయితే ఏమన్నా కలిసొచ్చేదా లేక ఆన్ లైన్ లో రిలీజ్ చేయటమే ఈ సినిమాకు మంచిదైందా...సురేష్ బాబు వంటి స్టార్ ప్రొడ్యూసర్ ఈ సినిమాని రిలీజ్ చేయటానికి పూనుకోవటానికి ఉన్న స్పెషల్ కంటెంట్ ఏమిటో రివ్యూలో చూద్దాం.
కథేంటి:
అమృత మాస్టర్స్ డిగ్రీ చేయటానికి ఆస్ట్రేలియా వెళ్తుంది. అక్కడ ఆమెను రిసీవ్ చేసుకోవటానికి వచ్చిన తెలుగు కుర్రాడు రామ్ తో లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అనుకుంటూ ప్రేమలో పడుతుంది. రామ్ అక్కడ చదువు పూర్తి చేసుకుని ఉద్యోగం,సద్యోగం లేకుండా బేవర్స్ గా తిరుగుతూంటాడు. తనలాంటి మరికొంతమంది స్నేహితులతో చెట్లు క్రింద కబుర్లు చెప్పుకుంటూ కాలక్షేపం చేస్తూంటాడు. తన టాలెంట్ ని గుర్తించి ఎవరో ఒకరు పెద్ద ఉద్యోగం ఇస్తాడని ఆశిస్తూంటాడు. అయితే ఈ లోగా అమృత అతనికి దగ్గరవటానికి ప్రయత్నిస్తుంది. కొద్ది రోజులకు సక్సెస్ అవుతుంది కూడా. ఇద్దరూ కలిసే ఉంటారు.
ఆమె ఓ రెస్టారెంట్ లో పనిచేస్తూ చదువుకుంటూంటుంది. అయితే అమృత ప్రేమ డోస్ ఎక్కువై..చాలా సార్లు అసూయగా,ఆ తర్వాత గొడవలుగా మారతూంటుంది. ఎవరైనా అక్కడ కల్చర్ ని అనుసరించి హగ్ ఇచ్చినా కూడా తట్టుకోలేదు. ఇదిలా ఉంటే అక్కడే జేడీ అనే ఓ వడ్డీ వ్యాపారి ఉంటాడు. మన తెలుగు సినిమాల్లో విలన్ లాగ ఓ బనీన్, లుంగీ కట్టుకుని,నోట్లో చుట్ట పెట్టుకుని పదిరూపాయలు వడ్డి వసూలు చేస్తూంటాడు. అతని దగ్గర ఓ సారి అప్పుచేసి ఇరుక్కుపోతాడు రామ్.
ఇది గమనించిన అమృత ..రామ్ ని ఓ ఉద్యోగంలో సెట్ అయ్యేలా చేస్తుంది..అప్పు తీర్చేందుకు ప్రయత్నం చేస్తుంది. ఇలా కథ సాదాగా నడుస్తూ..అక్కడక్కడా పాకుతూంటే...కథలోకి మరో తెలుగువాడు వస్తాడు. వాడు మన హీరోయిన్ అమృతపై కన్నేస్తాడు. రామ్ అంటే మండిపడుతూంటాడు. అతను తెలుగు సీరియల్స్ చూస్తాడో ఏమో కానీ..రామ్ వేరే అక్కడ అమ్మాయితో ఆమెకు ఒంట్లో బాగోలేదని సపర్యలు చేస్తూంటే...దాన్ని వీడియో తీసి,అనుమానం కలిగేలా షాట్స్ కట్ చేసి, హీరోయిన్ అమృతకు చూపిస్తాడు. దాంతో ఆమె మరింత మండిపడుతుంది.
ఇలా కథ అనుమానాలు, అపార్దాలు, అసూయలు అనే స్కీమ్ లతో క్లైమాక్స్ కు చేరుకుని ఇక ఒకటైపోతారనుకుంటే...అప్పుడు ఓ ఊహించని ట్విస్ట్ పడుతుంది. మన హీరో రామ్ కు యాక్సిడెంట్ అవుతుంది. హార్ట్ కు పెద్ద హోల్ పడుతుంది. అప్పుడు ట్రీట్మెంట్ చేస్తున్న డాక్టర్ ... ఓ మాట అంటాడు. ఎవరైనా యాక్సిడెంట్ అయ్యి బ్రెయిన్ డెడ్ అయిన వారు హార్ట్ దానం చేస్తే కోలుకుంటాడని... ఆ విషయం తెలిసిన హీరోయిన్ అమృత ఏం చేసిందనేది ఉత్కంఠ కలిగించే క్లైమాక్స్.
ఎలా ఉందంటే.:
ఈ సినిమా చాలా సాదా సీదాగా ఉంటుంది. క్లైమాక్స్ ని నమ్ముకుని సినిమా మొత్తం డిజైన్ చేసినట్లుంది. క్లైమాక్స్ కూడా Search Love Likes Coincidences అనే సినిమా నుంచి లేపారని అర్దమైపోతుంది. ఇలాంటి ఫీల్ గుడ్ పాక్టర్ తో నడిచే సినిమాలు పెద్ద స్టార్స్ చేస్తేనే కష్టం అనిపిస్తుంది. అనుభవం ఉన్న గౌతమ్ మీనన్ వంటి డైరక్టర్స్ డీల్ చేస్తేనే చూడబుద్దేస్తుంది. అసలు దర్శకుడు సినిమాలో కాంప్లిక్ట్ పాయింట్ ఎక్కడా రైజ్ చేయకుండా నడిపేద్దామనుకోవటమే ఆశ్చర్యం అనిపిస్తుంది. ఫస్టాఫ్ ఏమీ జరిగినట్లుండదు. కొత్తవారి మధ్య అదీ సరైన సీన్స్ లేకుండా లవ్ స్టోరీ నడుపుతూంటే చేతిలో ఉన్న మౌస్ ని ముందుకు తోసుకెళ్లాలనిపిస్తుంది. సినిమాలో అయితే ఆ అవకాసం ఉండదు. ఇక సెకండాఫ్ దీ అదే పరిస్దితి.
దర్శకత్వం, మిగతా విభాగాలు:
దర్శకుడు ఈ సినిమాకి రైటర్. స్క్రిప్టు దగ్గరే ఈ సినిమా సగం దెబ్బకొట్టింది. కొత్తవాళ్లతో చేసేటప్పుడు కాస్తంత ఇంట్రస్టింగ్ లవ్ స్టోరీ, కాంప్లిక్ట్ పాయింట్ తీసుకోకుండా పరమ రొటీన్ సీన్స్ తో అల్లుకుంటూపోయారు. అలాగే దర్శకత్వం కూడా చాలా ప్లాట్ గా ఉంటుంది. ఎక్కడా మెరుపులు ఉండవు. ఉన్నంతలో సినిమా డైలాగులు బాగున్నాయి. ఇక ఇలాంటి లవ్ స్టోరీలకు పాటలు, కెమెరా వర్క్ ప్రాణంగా ఉండాలి. పాటలు జస్ట్ ఓకే అన్నట్లుంటాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రం చాలా చోట్ల ఆహ్లాదంగా ఉంది. కెమెరా వర్క్ ..ఉన్నంతలో ఫరవాలేదు. సినిమా మొత్తం ఎబ్రాడ్ లో షూట్ చేసారు. కానీ అదేంటో ఈ కథ ఇక్కడే మన వీధిలో జరుగుతున్నట్లు అనిపిస్తుంది. ఎడిటర్ కూడా చూసేవాళ్లను ఇబ్బంది పెట్టారు. రిపీట్ అవుతున్న సీన్స్ ని ఎడిట్ చేయకుండా వదిలేసాడు. మిగతా డిపార్టమెంట్స్ సోసో.
ఇక నటీనటులంతా కొత్తవారైనా ...బాగానే చేసారని చెప్పాలి. ముఖ్యంగా హీరోయిన్ చాలా చోట్ల మంచి ఎక్సప్రెషన్స్ ఇచ్చింది. హీరో గా చేసిన అతను నాచురల్ గా చేయటానికి ప్రయత్నించాడు. ఇక వడ్డీ వ్యాపారి జేడీగా చేసినతను..ఇక్కడ తెలుగు పరిశ్రమలో కు వచ్చి వేషాలు ట్రై చేయచ్చు.
ఫైనల్ థాట్
ఇలాంటి సినిమాలు మరో నాలుగు వస్తే డైరక్ట్ ఓటీటి రిలీజ్ అయినా జనం పెద్దగా ఆసక్తి చూపించరు.
Rating: 1.5