తెలుగు సినీ పరిశ్రమలో అభిరుచి ఉన్న నిర్మాతగా దిల్ రాజు కు పేరుంది. ముఖ్యంగా ఆయన సినిమాలు టైటిల్స్ దగ్గర నుంచి ప్రతీ విషయంలోనూ ఆయన టేస్ట్ కనపడుతూంటుంది. ఫ్యామిలీలకు నచ్చే టైటిల్స్ మాత్రమే కాకుండా యూత్ లో కు వెళ్లే కథలు, టైటిల్స్ దిల్ రాజు సొంతం. ఈ మేరకు, ఆయన టీమ్ తో కలిసి సుదీర్ఘమైన కసరత్తు చేస్తారని చెప్తూంటారు. తాజాగా రకరకాలుగా ఆలోచించి 'గుడ్ లక్ సఖీ' టైటిల్ ని తన కొత్త చిత్రానికి ఫైనలైజ్ దిల్ రాజు ఫైనలైజ్ చేసినట్లు సమాచారం. ఆ టైటిల్ గత కొంత కాలంగా మీడియాలో నలిగినా, అటే ఓటేసినట్లు చెప్తున్నారు. ఇంతకీ ఏ హీరో సినిమాకు అనేకదా మీ ప్రశ్న. 

వివరాల్లోకి వెళితే...ప్రముఖ దర్శకుడు నగేశ్ కుకునూర్ దర్శకత్వంలో 'దిల్' రాజు నిర్మాతగా కీర్తి సురేశ్ ఓ సినిమా చేస్తోంది. ఇప్పటికే ఈ సినిమా చాలావరకూ షూటింగ్ జరుపుకుంది. ఇటీవలే ఈ సినిమాకి ఒక టైటిల్ అనుకున్నారట. అయితే ఆ టైటిల్ 'దిల్' రాజుకి నచ్చకపోవడంతో, ఆ విషయంపై గట్టిగానే కసరత్తు చేశారట. చివరికి 'గుడ్ లక్ సఖీ' అనే టైటిల్ ను ఖరారు చేసినట్టుగా తెలుస్తోంది. ఇటు యూత్ ను .. అటు ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకునేలా ఈ టైటిల్ ఉందనే అభిప్రాయంతో దీన్ని ఫైనలైజ్ చేసారట. ఇక ఈ కథలో కొత్తదనం .. తన పాత్రలోని ప్రత్యేకత కారణంగా, ఈ సినిమా తనకి తప్పకుండా హిట్ ఇస్తుందనే నమ్మకంతో కీర్తి సురేశ్ ఉందట. ఈ సినిమా కూడా ఈ ఏడాదిలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.  

కీర్తీ సురేశ్, ఆది పినిశెట్టి, జగపతి బాబు ముఖ్యపాత్రల్లో నగేశ్‌ కుకునూర్‌ దర్శకత్వంలో క్రీడల నేపథ్యంలో ఈ కామెడీచిత్రం తెరకెక్కుతోంది. ‘హైదరాబాద్‌ బ్లూస్, ఇక్బాల్‌’ వంటి చిత్రాలతో అందరి దృష్టి ఆకర్షించిన హైదరాబాదీ ఫిల్మ్‌మేకర్‌ నగేశ్‌ ఈ సినిమా ద్వారా టాలీవుడ్‌కు పరిచయం అవుతున్నారు. సుధీర్‌ చంద్ర నిర్మిస్తున్న ఈ సినిమాను ప్రముఖ నిర్మాత ‘దిల్‌’ రాజు సమర్పించనున్నారు.  ఈ సినిమా షూటింగ్ తుది దశకు చేరుకుంది.  ఈ సినిమాకు సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, కెమెరా: చిరంతన్‌ భట్, సహ నిర్మాత: శ్రావ్యా వర్మ.