Asianet News TeluguAsianet News Telugu

‘వి’ : దిల్ రాజుకు ఎంత లాభమో తెలిస్తే కళ్లు తేలేస్తాం

ఈ సినిమాని దిల్ రాజు కావాలని వదిలించుకున్నాడని ప్రచారం మీడియాలో ఓ రేంజిలో జరిగింది. దిల్ రాజు ముందే ఈ సినిమా ప్లాఫ్ అని ఊహించాడని అన్నారు. అయితే ఈ సినిమా వల్ల అమేజాన్ ప్రైమ్ కు లాభమా,నష్టమా అనేది ప్రక్కన పెడితే.. నిర్మాత దిల్ రాజుకు మాత్రం ఈ సినిమా వల్ల పది కోట్లు లాభమని తెలుస్తోంది.  

Dil Raju makes 10 cr profit on V movie?
Author
Hyderabad, First Published Sep 12, 2020, 8:08 AM IST

 ‘వి’ : దిల్ రాజుకు ఎంత లాభమో తెలిస్తే కళ్లు తేలేస్తాం 

నేచుర‌ల్ స్టార్ నాని 25వ చిత్రం ‘వి’.  సుధీర్ బాబు, అదితిరావు హైద‌రిల‌తో క‌లిసి నివేదా థామ‌స్ న‌టించారు. శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై మోహ‌న‌కృష్ణ ఇంద్ర‌గంటి ద‌ర్శ‌క‌త్వంలో దిల్‌రాజు, శిరీష్‌, హ‌ర్షిత్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్‌లో సెప్టెంబ‌ర్ 5న విడుద‌ల చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు డివైడ్ టాక్ నడుచింది. ఈ నేపధ్యంలో ఈ సినిమాని దిల్ రాజు కావాలని వదిలించుకున్నాడని ప్రచారం మీడియాలో ఓ రేంజిలో జరిగింది. దిల్ రాజు ముందే ఈ సినిమా ప్లాఫ్ అని ఊహించాడని అన్నారు. అయితే ఈ సినిమా వల్ల అమేజాన్ ప్రైమ్ కు లాభమా,నష్టమా అనేది ప్రక్కన పెడితే.. నిర్మాత దిల్ రాజుకు మాత్రం ఈ సినిమా వల్ల పది కోట్లు లాభమని తెలుస్తోంది.  

OTT రైట్స్ (అమేజాన్ ప్రైమ్) – రూ 31 కోట్లు
శాటిలైట్ (జెమినీ) – రూ. 8 కోట్లు
హిందీ డబ్బింగ్ – రూ. 7 కోట్లు 
మొత్తం రెవిన్యూ: రూ. 46 కోట్లు 

ఇక ఈ సినిమాకు అయిన ఖర్చు
పెట్టుబడి: రూ. 33కోట్లు
లాభం: రూ. 13 కోట్లు (46 – 33 = 13)
వడ్డీలు: 3 కోట్లు
ఫైనల్ ఫ్రాఫిట్: రూ. 10 కోట్లు

నాని  ఈ చిత్రంలో పూర్తి నెగటీవ్‌ షేడ్స్‌ ఉన్న క్రిమినల్ పాత్రలో కనిపించగా.. పవర్‌ఫుల్‌ పోలీస్‌ ఆఫీసర్‌ గా సుధీర్‌ బాబు మెప్పించాడు.  వెన్నెల కిషోర్‌ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి అమిత్‌ త్రివేది సంగీతమందించాడు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌ రాజు, శిరీష్, హర్షిత్‌ రెడ్డి నిర్మించారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios