దిల్ రాజుని చాలా తెలివైన బిజినెస్ మ్యాన్ గా సినిమా వాళ్లు చెప్తూంటారు. ఏ సినిమాకు ఎంత బడ్జెట్ పెట్టాలో అంతకు మించి రూపాయి పెట్టడానికి కూడా ఇంట్రస్ట్ చూపరు. అదే విధంగా క్వాలిటీ విషయంలోనూ రాజీ పడరు. ఓ పెద్ద పెద్ద సినిమాలు తీసే ఆయన మరో ప్రక్క చిన్న బడ్జెట్ సినిమాలతోనూ థియోటర్స్ కు ఫీడింగ్ ఇస్తున్నారు. వరస పెట్టి ప్రాజెక్టులు ఓకే చేస్తున్న ఆయన రీసెంట్ గా శ్రీ విష్ణుతో ఓ సినిమా చేయటానికి రెడీ అవుతున్నట్లు సమాచారం.

సతీష్ అనే కొత్త దర్శకుడు ఈ చిత్రంతో పరిచయం కానున్నారు. ఈ కథని శ్రీవిష్ణు విని ఇప్పటికే ఓకే చేసారు. ఫ్యామిలీ ఎమోషన్స్ మధ్య జరిగే ఈ కథలో కాన్సెప్టు బేసెడ్ డ్రామా గా సాగుతుందని చెప్తున్నారు. అయితే ఈ సినిమాకు దిల్ రాజు కేటాయించిన బడ్జెటే అందరికీ షాక్ ఇస్తోంది. మూడు కోట్లు లో ఈ సినిమా పూర్తి చేయాలని క్లియర్ గా దర్శకుడుకు చెప్పి ప్రాజెక్టు ముందుకు తీసుకువెళ్తున్నారట. తను రీసెంట్ గా తీసిన చిన్న బడ్జెట్ సినిమాలు ఇద్దరి లోకం ఒకటే, జాను సినిమాలు భాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అవటంతో ఈ నిర్ణయం తీసుకోక తప్పదంటున్నారు. 

శ్రీవిష్ణుకు కూడా అనుకున్న స్దాయిలో మార్కెట్ లేకపోవటం,తిప్పరా మీసం డిజాస్టర్ అవటం, మినిమం ఓపినింగ్స్ తెచ్చుకోకపోవటం జరిగింది. దాంతో శ్రీ విష్ణు కూడా ఓకే అన్నారట. అయితే కథ అధ్బుతంగా కుదరిందని, బొమ్మరిల్లు లాంటి మరో  హిట్ తమ బ్యానర్ లో వస్తుందని దిల్ రాజు ధీమాగా చెప్తున్నారట.