నాగార్జున హీరోగా రూపొందుతున్న చిత్రం `వైల్డ్ డాగ్‌`. ఈ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెడుతోంది హిందీ నటి దియా మీర్జా. శక్తివంతమైన కాప్‌గా ఆమె కనిపించబోతుంది. సోల్మన్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్ర షూటింగ్‌ దాదాపు పూర్తి కావచ్చింది. ఇదిలా ఉంటే ఇందులో హీరోయిన్‌గా నటిస్టున్న దియా మీర్జా తాజాగా పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అవకాశాల కోసం తాను ఎవరినీ వాడుకోలేదని తెలిపింది. 

సినిమాల్లో ఆఫర్స్ కోసం తాను తన స్నేహాలను కూడా వాడుకోలేదట. సినిమా ఛాన్స్ లేక తాను ఎంతో అసహనానికి గురయ్యానని, ఆ విషయం తన స్నేహితులకే తెలుసని పేర్కొంది. తాజాగా ఓ ఇంగ్లీష్‌ పేపర్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో దియా ఈ విషయాలను వెల్లడించింది. 

తాను చాలా ఏళ్లుగా బాలీవుడ్‌ చిత్ర పరిశ్రమలో కొనసాగుతున్నానని, దీంతో తనకు పరిశ్రమలో స్నేహితులు చాలా మందే ఉన్నారని తెలిపింది. నాలాంటి అభిరుచులు ఉన్న తోటి నటీనటులు, పలువురు ప్రముఖులు నాకు స్నేహితులయ్యారు. ఏదైనా సినిమాలో ఆఫర్స్ పొందడం కోసం ఆ స్నేహాన్ని ఉపయోగించుకోలేదు. కెరీర్‌ పరంగా `సంజు`, `తప్పడ్‌` చిత్రాలు నాకు మంచి గుర్తింపుని తెచ్చిపెట్టాయని పేర్కొంది దియా.