విక్రమ్ తనయుడు ధృవ్ నటించిన తొలి చిత్రం ఆదిత్య వర్మ. తెలుగులో ఘనవిజయం సాధించిన అర్జున్ రెడ్డి చిత్రానికి ఇది రీమేక్. విలక్షణ తనతో దక్షణాది అభిమానులలో క్రేజ్ తెచ్చుకున్న విక్రమ్ తనయుడి చిత్రం కావడంతో సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది. ఆదిత్య వర్మ టైటిల్ తో ఈ మూవీ తెరకెక్కింది. 

ధృవ్ విక్రమ్ సరసన బనిత సందు కథానాయికగా నటించింది. తెలుగులో రొమాంటిక్, ఎమోషనల్ ప్రేమ కథగా యువత మెప్పించిన సంగతి తెలిసిందే. హిందీలో రీమేక్ అయి అక్కడ కూడా విజయాన్ని అందుకుంది. దీనితో ఆదిత్య వర్మ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. శుక్రవారం రోజు ఆదిత్య వర్మ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 

ప్రభాస్ 'బాహుబలి'ని ఢీకొట్టబోతున్న విక్రమ్ తనయుడు ధృవ్!

తొలి షో నుంచే ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ మొదలయింది. క్రిటిక్స్ కూడా పాజిటివ్ రివ్యూలు ఇస్తున్నారు. ముఖ్యంగా ధృవ్ విక్రమ్ నటనకు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. బోల్డ్, ఎమోషనల్ గా సాగే ప్రేమ కథలో తొలి చిత్రంతోనే ధృవ్ నటనలో పరిణితి కనబరిచాడని అంటున్నారు. 

తమిళ యువతని ఈ చిత్రం మెప్పించడం ఖాయం అని క్రిటిక్స్ అంటున్నారు. బనిత సందు నటనకు కూడా ప్రశంసలు దక్కుతున్నాయి. హీరోయిన్ ప్రియా ఆనంద్ ఈ మూవీలో కీలక పాత్రలో నటించింది. 

ఇక విక్రమ్ తనయుడిగా ధృవ్ విక్రమ్ సినీరంగ ప్రవేశం అంత సాఫీగా జరగలేదు. అర్జున్ రెడ్డి చిత్రం చూడగానే.. తన తనయుడి డెబ్యూ మూవీ ఇదే అని విక్రమ్ డిసైడ్ అయ్యాడు. దీనితో అర్జున్ రెడ్డి తమిళ రీమేక్ కు సీనియర్ దర్శకుడు బాలని ఎంపిక చేసుకున్నారు. సినిమా షూటింగ్ మొత్తం పూర్తయింది. ట్రైలర్ కు కూడా రిలీజై గత ఏడాదే ఈ చిత్రం విడుదలకు సిద్ధం అయింది. 

కానీ బాల టేకింగ్ విక్రమ్ కు నచ్చలేదు. నిర్మాతలు కూడా అవుట్ పుట్ పై అసంతృప్తి వ్యక్తం చేశారు. దీనితో బాల ఈ చిత్రం నుంచి తప్పుకున్నారు. ఆ తర్వాత గిరిసాయి దర్శకుడిగా ఆదిత్య వర్మ షూటింగ్ ని తిరిగి ప్రారంభించారు. ఆ చిత్రమే నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 

మొత్తంగా తన తనయుడికి తొలి చిత్రంతోనే హిట్ ఇవ్వాలనే విక్రమ్ పంతం నెరవేరింది. రాధన్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. E4 ఎంటర్టైన్మెంట్స్ సంస్థ ఆదిత్య వర్మ చిత్రాన్ని నిర్మించింది.