కార్తి హీరోగా రూపొందిన `ఆయిరతిల్‌ ఓరువన్‌`(తెలుగులో యుగానికి ఒక్కడు) చిత్రం పెద్ద విజయాన్ని సాధించింది. సెల్వరాఘవన్‌ రూపొందించిన ఈ పీరియాడికల్‌ విజువల్‌ వండర్‌ మంచి విజయాన్ని సాధించింది. కమర్షియల్‌గా కన్నా, క్రిటికల్‌గా మంచి ప్రశంసలందుకుంది. అయితే ఆ సినిమా నేటి కాలంలో వచ్చి ఉంటే సంచలన విజయం సాధించేదని, `బాహుబలి` తరహాలో పాన్‌ ఇండియా సినిమాగా వందల కోట్లు కలెక్ట్ చేసి ఉండేదనే కామెంట్‌ వినిపించాయి. 

అయితే ఇప్పుడు ఆ సినిమాకి సీక్వెల్‌ని ప్రకటించారు హీరో ధనుష్‌. `ఆయిరతిల్‌ ఓరువన్‌ 2`లో ధనుష్‌ హీరోగా నటిస్తున్నారు. సెల్వరాఘవన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. సెల్బరాఘవన్‌, ధనుష్‌ ఈ సినిమాని అధికారికంగా శనివారం ప్రకటించారు. అంతా బాగానే ఉంది కానీ, ఇది తెరకెక్కేది మరో మూడు సంవత్సరాల తర్వాత కావడం గమనార్హం. 2024 దీన్ని ప్రారంభిస్తారట. 

ధనుష్‌ ఈ విషయాన్ని చెబుతూ, ప్రీ ప్రొడక్షన్‌ వర్క్ జరుగుతుంది. ఇందులో నటించేందుకు వేచి ఉంటాను. సినిమా కోసం మా బెస్ట్ ఇస్తామని. 2024లోనే యువరాజు తిరిగి వస్తాడు` అని ధనుష్‌ పేర్కొన్నారు. మూడేళ్ల తర్వాత రూపొందించే ఈ సినిమాని ఇప్పుడు ప్రకటించడంపై ఓ వైపు ఆసక్తి నెలకొనడంతోపాటు సెటైర్లు వినిపిస్తున్నాయి. ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్‌ వర్క్ కి అంత టైమ్‌ పట్టే ఛాన్స్ ఉందని టాక్‌. మరోవైపు ధనుష్‌ ప్రస్తుతం `జగమే తంత్రం`, `కర్ణన్‌`, `అట్రాంగి రే` చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. మరోవైపు ఓ ఇంగ్లీష్‌ చిత్రంలోనూ నటించేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు.