అవును..విజయ్ దేవరకొండ సోదరుడు త్వరలో ఓ టిఫెన్ సెంటర్ ఓపెన్ చేయబోతున్నాడు. అదీ గుంటూరులో అని అంటున్నారు. నిజమేనా. అసలేం జరిగింది...ఏం జరగబోతోంది.టాలీవుడ్ యంగ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరోగా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. గత ఏడాది విడుదలైన ట్రాజిక్ పీరియాడిక్ లవ్ డ్రామా దొరసాని మూవీలో ఆనంద్ దేవరకొండ నటించారు. ఆ మూవీతో హీరో రాజశేఖర్ కూతురు శివాత్మిక కూడా వెండితెరకు పరిచయం కావడం విశేషం.

ఆ చిత్ర ఫలితం ఎలా ఉన్నా ఆనంద్ దేవరకొండ నటనకు మంచి మార్కులే పడ్డాయి. కాగా ఈ యంగ్ ఫెలో ఓ కొత్త మూవీ ప్రకటించారు.భవ్య క్రియేషన్స్ ఆనంద్ దేవరకొండతో మూవీ చేయనున్నారు. దీనిపై అధికారిక ప్రకటన వెలువడింది. వినోద్ అనంతోజు అనే ఓ నూతన దర్శకుడు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో ఆనంద్ దేవరకొండ ..ఓ టిఫెన్ సెంటర్ ని గుంటూరు పెట్టి డవలప్ చేస్తాడట. అందుకోసం చెట్నీలు వంటివి చేయటం ఇంటి దగ్గర ప్రాక్టీస్ కూడా చేసాడట.

ఆనంద్‌ దేవరకొండ, వర్ష బొల్లమ్మ జంటగా భవ్య క్రియేషన్స్‌ నిర్మించిన చిత్రం మిడిల్‌ క్లాస్‌ మెలోడీస్‌ వినోద్‌ అనంతోజు దర్శకునిగా పరిచయమ వుతున్నారు. వెనిగళ్ళ ఆనందప్రసాద్‌ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం అన్నీ కార్యక్ర మాలను పూర్తి చేసుకుంది. 

ఈ సందర్భంగా…. నిర్మాత మాట్లాడుతూ సినిమా షూటింగ్‌ మొత్తం పూర్తయింది. తొలి కాపీ కూడా సిద్ధంగా ఉంది. కథకు ప్రాధాన్య మిస్తూ సినిమాలు తీద్దామనుకునే నిర్ణయం లో భాగంగా ఈ చిత్రాన్ని రూపొందించాం. గుంటూరు నేపథ్యంలో కథ సాగుతుంది. పాత్రలన్నీ గుంటూరు యాసలోనే మాట్లాడుతాయి. త్వరలోనే విడుదల తేదీ వివరాలను వెల్లడిస్తాం” అని అన్నారు.

చిత్ర దర్శకుడు వినోద్‌ అనంతోజు మాట్లాడుతూ ”మామూలు మనుషుల జీవితాలలో ఉండే సున్నితమయిన హాస్యాన్ని ఇందులో చూపించాము. ప్రతి ఒక్కరూ తమను తాము ఐడెంటిఫై చేసుకునేలా పాత్రలుంటాయి. వాటితో పాటు మంచి లవ్‌ స్టోరీ కూడా ఉంది. ఆనంద్‌ దేవరకొండ తొలి చిత్రం దొరసానికి పూర్తి భిన్నంగా ఇందులో ఆయన పాత్ర ఉంటుంది.’కేరాఫ్‌ కంచరపాలెంతో పాటు పలు చిత్రాలకు సంగీతం అందించిన స్వీకర్‌ అగస్తి మా చిత్రానికి మంచి పాటలు ఇచ్చారు. మొత్తం ఐదు పాటలున్నాయి అని అన్నారు.ఈ చిత్రంలో ఆనంద్‌ దేవరకొండ, వర్ష బొల్లమ్మ, చైతన్య గరికపాటి, దివ్య శ్రీపాద, గోపరాజు రమణ, సురభి ప్రభావతి, ప్రేమ్‌ సాగర్‌, ప్రభావతి వర్మ తదితరులు నటిస్తున్నారు. కెమెరా: సన్నీ కూరపాటి.కథ, సంభాషణలు: జనార్దన్‌ పసుమర్తి.