టాలీవుడ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ లో టాలెంట్ కట్టలు తెంచుకుని ఎప్పుడు విజృంభిస్తామా అన్నట్లు ఉంటుంది. ఎప్పటికప్పుడు విభిన్నమైన క్యారక్టరైజేషన్స్, కథలతో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తూంటారు. ఆయనకు ప్రత్యేకమైన కల్ట్ ఫాలోయింగ్ ఉంది. అయితే డియర్ కామ్రేడ్, వరల్డ్ ఫేమస్ లవర్ చిత్రాలు ఆయన లో మార్పు తీసుకొచ్చాయంటున్నారు. వరసగా వచ్చిన ఈ రెండు డిజాస్టర్స్ విజయ్ దేవరకొండను కమర్షియల్ సినిమా వైపు యూటర్న్ తీసుకునేలా చేసాయని ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం. అందులో మొదటి అడుగు పూరి జగన్నాథ్ దర్శకత్వంలో చేయటమే అని చెప్తున్నారు. 

మేకోవర్ స్పెషలిస్ట్ గా పూరి జగన్నాథ్ కు పేరు ఉంది. పూరి దర్శకత్వంలో చేసాక హీరోల ఆన్ స్క్రీన్ ఇమేజ్ మారిపోతూంటుంది. మహేష్ బాబు, ఎన్టీఆర్, ప్రభాస్ వంటి స్టార్స్ అందరూ అలా మాస్ ఇమేజ్ ని పూరి స్కూల్ లోకి వెళ్లాక రెట్టింపు చేసుకున్నవాళ్లే. ఇప్పుడు ఫైటర్ టైటిల్ తో విజయ్ దేవరకొండ చేస్తున్న చిత్రం సైతం పూర్తి స్దాయి కమర్షియల్ ఎంటర్టైనర్ అని తెలుస్తోంది. ఈ సినిమా రిలీజ్ అయ్యాక విజయ్ దేవరకొండ కు మాస్ లో ఇమేజ్ ఓ రేంజిలో పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. అందుకు తగినట్లే తన తదుపరి సినిమాలు సైతం ప్లాన్ చేసుకోవాలని విజయ్ భావిస్తున్నారట. ఆ మేరకు పావులు కదుపుతున్నారట.

విజయ్ తన తదుపరి చిత్రాలు స్టార్ డైరక్టర్స్ ప్లాన్ చేస్తారని చెప్తున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్, కొరటాల శివ వంటి దర్శకులతో విజయ్ భవిష్యత్ చిత్రాలు ఉండవచ్చని వార్తలు వినపడుతున్నాయి. ఓ ప్రక్క కొత్త నీరుకు అవకాసం ఇస్తూనే ..స్టార్ డైరక్టర్స్ తో పని చేస్తూ తనలోని మాస్ యాంగిల్ ని పూర్తిగా ఆవిష్కరించబోతున్నాడన్నమాట. ఇది విజయ్ దేవరకొండ కొత్త స్ట్రాటజీ అని తెలుస్తోంది. ఈ మేరకు ఆయా దర్శకులతో చర్చలు జరపటానికి సంకేతాలు పంపుతున్నారట. అయితే ఈ ప్రాజెక్టులన్నీ లైన్ లోకి రావటానికి కాస్త టైమ్ పడుతుంది. ఈ లోగా తను కమిటైన సినిమాలు పూర్తి చేస్తాడన్నమాట. కాబట్టి త్వరలో మనం త్రివిక్రమ్, విజయ్ దేవరకొండ కాంబో సినిమా చూసే అవకాసం ఉందన్నమాట. సూపర్ కదా.