కరోనా కారణంగా 5 నెలలుగా సినిమాలకు సంబంధించిన అన్ని కార్యక్రమాలు స్థంబించిపోయాయి. ఇప్పడిప్పుడే సినీ పరిశ్రమకు అన్‌ లాక్‌ అవుతోంది. ఒక్కరొక్కరుగా నటీ నటులు షూటింగ్‌లకు రెడీ అవుతున్నారు. ఈ నేపథ్యంలో దీపిక పదుకొనే కూడా అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ షూటింగ్ చేసేందుకు ఓకే చెప్పింది. షకున్ బాత్రా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్‌లో పాల్గొనేందుకు త్వరలోనే గోవాకు వెళ్లనుంది దీపిక.

అయితే ఆ షూటింగ్‌కు వెళ్లే ముందే మూడు రోజుల పాటు పూర్తి తన ఎండార్స్‌ చేస్తున్న బ్రాండ్స్‌కు సంబంధించిన షూటింగ్‌లలో పాల్గొననుందట. కరోనా కారణంగా ఈ యాడ్‌ షూట్‌లను కూడా వాయిదా వేస్తూ వస్తోంది దీపిక. దీంతో వాటిని పూర్తి చేసిన తరువాతే సినిమా షూటింగ్‌లు ప్రారంభించాలని ఫిక్స్‌ అయ్యింది. అందుకే మూడు రోజులు పక్కగా ప్లాన్ చేసింది. సినిమా షూటింగ్‌ను స్టార్ట్‌ చేస్తే తిరిగి బ్రాండ్స్‌కు టైం ఇచ్చే అవకాశం ఉందన్న ఉద్దేశంతోనే ముందే ఆ షూటింగ్‌ కంప్లీట్ చేయాలని భావిస్తోంది. దీపిక.

చాలా ఏళ్లుగా దీపిక ఖాతాలో చాలా బ్రాండ్‌ను ఉన్నాయి. లాక్‌ డౌన్‌ సమయంలోనూ కొన్ని బ్రాండ్స్‌  ప్రమోషన్‌కు ఓకే చెప్పింది దీపిక. లాక్‌ డౌన్‌ కారణంగా ఖాళీగా ఉన్న సమయాన్ని కూడా చాలా బాగా యుటిలైజ్‌ చేసుకుంది దీపిక. ఆన్‌ లైన్‌ ద్వారా కొన్ని కథలను విని లైన్‌లో పెట్టింది.  ఇక సినిమాల విషయానికి వస్తే అమ్మడి ఖాతాలో చాలా సినిమాలే ఉన్నాయి. షకున్‌ బాత్రా సినిమాతో పాటు ప్రభాస్ హీరోగా నాగ అశ్విన్‌ దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమా కూడా దీపిక నటిస్తోంది. మరికొన్ని సినిమాల అఫీషియల్‌ ఎనౌన్స్‌మెంట్ రావాల్సి ఉంది.