Asianet News TeluguAsianet News Telugu

బాలీవుడ్ డ్రగ్స్ కేసు: ఐదు గంటల విచారణలో.. దీపికను ఎన్సీబీ ఏం అడిగిందంటే.?

బాలీవుడ్ డ్ర‌గ్స్ కేసులో స్టార్ హీరోయిన్ దీపికా ప‌దుకొణేను ఎన్సీబీ అధికారులు ఐదు గంట‌ల పాటు విచారించారు. అయితే దీపిక ఇచ్చిన స‌మాధానాల‌తో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు సంతృప్తి చెంద‌లేద‌ని తెలుస్తోంది. 

Deepika Padukone leave Narcotics Control Bureau zonal office
Author
Mumbai, First Published Sep 26, 2020, 8:40 PM IST

బాలీవుడ్ డ్ర‌గ్స్ కేసులో స్టార్ హీరోయిన్ దీపికా ప‌దుకొణేను ఎన్సీబీ అధికారులు ఐదు గంట‌ల పాటు విచారించారు. అయితే దీపిక ఇచ్చిన స‌మాధానాల‌తో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు సంతృప్తి చెంద‌లేద‌ని తెలుస్తోంది.

సుశాంత్ మరణంతో సంబంధం ఉన్న డ్ర‌గ్స్ కేసులో ఎన్సీబీ విచార‌ణ చేప‌డుతున్న విష‌యం తెలిసిందే. ఇవాళ ఉద‌యం 9 గంట‌ల‌కు ఎన్సీబీ ఆఫీసుకు వ‌చ్చిన దీపిక‌ను అధికారులు ప‌లు కోణాల్లో విచారించారు. అయితే ఆమె దాట‌వేత స‌మాధానాలు ఇచ్చిన‌ట్లు ప్రాథ‌మికంగా తెలుస్తోంది.  ఇంకా ఆమెకు ఈ కేసులో క్లీన్ చిట్ ఇవ్వ‌లేదు. 

డ్రగ్స్ కేసులో దీపికను ఎన్సీబీ అడిగిన ప్రశ్నలు ఇవే:

1. మీరు డ్రగ్స్ వాడతారా..? లేదా..?
2. డ్రగ్స్ కావాలని మేనేజర్ కరిష్మాతో చాట్ చేశారా..? లేదా.?
3. డ్రగ్స్ పార్టీలకు మీరు హాజరవుతారా..? లేదా..?
4. సుశాంత్ ఫామ్ హౌజ్‌లో జరిగే డ్రగ్ పార్టీలకు మీరు వెళ్లారా..? లేదా..?
5. కరిష్మాతో వ్యక్తిగత సంబంధాలున్నాయా..? లేదా..?
6. 2017లో మాల్ హై క్యా..? అని మీరు కరిష్మాకు మెసేజ్ పెట్టారా లేదా..?
7. రియా మీ పేరు చెప్పింది..? ఎవరెవరు పార్టీలకు అటెండ్ అయ్యారో చెప్పింది..? 
8. మీరు ఎవరికైనా డ్రగ్స్ అందజేశారా..?

మరోవైపు డ్ర‌గ్స్ కేసులో మ‌రో న‌టి శ్ర‌ద్ధాక‌పూర్‌ను కూడా ఇవాళ ఎన్సీబీ విచారించింది.  డ్ర‌గ్స్ తీసుకోలేద‌ని ఆమె విచార‌ణ‌లో వెల్ల‌డించింది. కానీ సుశాంత్ ఇచ్చిన ఫార్మ్‌హౌజ్ పార్టీకి మాత్రం హాజ‌రైన‌ట్లు ఆమె అంగీక‌రించింది. సీబీడీ ఆయిల్ గురించి జ‌య షాతో జ‌రిగిన చాటింగ్‌పై ఆమె ఎటువంటి స‌మాధానం ఇవ్వ‌లేదు. మ‌రో వైపు ఇదే కేసులో ధ‌ర్మ ప్రొడ‌క్ష‌న్స్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్ ర‌విప్ర‌సాద్‌ను ఎన్సీబీ అధికారులు అరెస్టు చేశారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios