Asianet News TeluguAsianet News Telugu

పడి పడి నవ్వాల్సిందే.. ఆస్ట్రేలియా క్రికెటర్‌తో హీరోయిన్‌ టిక్‌ టాక్‌

టాలీవుడ్‌ సూపర్‌ హిట్‌ సాంగ్స్‌తో వార్నర్ చేసిన టిక్‌ టాక్‌ వీడియోలు ఓ రేంజ్‌లో వైరల్‌ అయ్యాయి. రాములో రాములా, బ్లాక్‌ బస్టర్‌ పాటలకు వార్నర్‌ స్టెప్పులతో ఫ్యాన్స్‌ ఫుల్‌ ఖుషీ అయ్యారు. తాజాగా ఈ స్టార్‌ క్రికెటర్‌ బాలీవుడ్‌ ముద్దుగుమ్మతో కలిసి డ్యూయెట్ చేశాడు. సీనియర్‌ నటి శిల్పా శెట్టి, వార్నర్‌లు కలిసి చేసిన వీడియో వైరల్‌గా మారింది.

David Warners hilarious TikTok duet with Shilpa Shetty will make you ROFL
Author
Hyderabad, First Published Jun 14, 2020, 10:47 AM IST

కరోనా లాక్‌ డౌన్‌ ప్రభావం క్రీడా రంగం మీద కూడా గట్టిగానే ఉంది. దాదాపు అన్ని అంతర్జాతీయ టోర్నమెంట్స్‌ నిలిచిపోవటంతో క్రికెటర్లు కూడా ఇంటికే పరిమితమయ్యారు. ఈ నేపథ్యంలో ఒక్కొక్కరు ఒక్కో రకంగా టైం పాస్ చేస్తున్నారు. అయితే ఈ ఖాళీ సమయంలో ఇండియన్‌ సినీ అభిమానులకు చేరువయ్యాడు ఆస్ట్రేలియన్‌ స్టార్ క్రికెటర్‌ డేవిడ్ వార్నర్‌.

టాలీవుడ్‌ సూపర్‌ హిట్‌ సాంగ్స్‌తో వార్నర్ చేసిన టిక్‌ టాక్‌ వీడియోలు ఓ రేంజ్‌లో వైరల్‌ అయ్యాయి. రాములో రాములా, బ్లాక్‌ బస్టర్‌ పాటలకు వార్నర్‌ స్టెప్పులతో ఫ్యాన్స్‌ ఫుల్‌ ఖుషీ అయ్యారు. తాజాగా ఈ స్టార్‌ క్రికెటర్‌ బాలీవుడ్‌ ముద్దుగుమ్మతో కలిసి డ్యూయెట్ చేశాడు. సీనియర్‌ నటి శిల్పా శెట్టి, వార్నర్‌లు కలిసి చేసిన వీడియో వైరల్‌గా మారింది.

శిల్పా శెట్టి ఓ వెస్ట్రన్‌ సాంగ్‌ ఆలపిస్తుండగా పక్క ఫ్రేమ్‌లో ఉన్న వార్నర్‌ నవ్వులు చిందిస్తూ కనిపిస్తున్నాడు. ఇక ఆ వీడియో శిల్పా శెట్టి ముఖం ఓ ఎఫెక్ట్‌తో విచిత్రంగా చూపించటం మరింత కామెడీగా ఉంది. దీంతో అభిమానులు కూడా ఈ వీడియోను తెగ వైరల్‌ చేసేస్తున్నారు. ఒక్క రోజులోనే ఈ వీడియోకు దాదాపు 14 లక్షల వ్యూస్‌ రావటం విశేషం. తన ఇన్‌స్టాగ్రామ్‌ పేజ్‌లో టిక్ టాక్‌ వీడియోను షేర్ చేసిన వార్నర్‌.. ఈ వీడియో నాకు పిచ్చెక్కిస్తోంది అంటూ సరదాగా కామెంట్ చేశాడు.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

This made me laugh so much😂😂 crazy time @theshilpashetty

A post shared by David Warner (@davidwarner31) on Jun 12, 2020 at 5:54am PDT

Follow Us:
Download App:
  • android
  • ios