Asianet News TeluguAsianet News Telugu

టాలీవుడ్ లో బడా ఫ్యామిలీకి ఇబ్బందిగా మారిన ఆమె వ్యవహారం ?

టాలీవుడ్ లో ఆధిపత్యం చలాయించే కుటుంబాలు చాలానే ఉన్నాయి. అలాంటి ఓ ఫ్యామిలీపైనే పెత్తనం చలాయించే కొత్త కోడలు వచ్చిందనేది ప్రస్తుతం ఫిలిం సర్కిల్స్ లో హాట్ టాపిక్.

daughter in law's behaviour becomes hot topic in tollywood
Author
Hyderabad, First Published Aug 11, 2021, 1:11 PM IST

టాలీవుడ్ లో ఆధిపత్యం చలాయించే కుటుంబాలు చాలానే ఉన్నాయి. అలాంటి ఓ ఫ్యామిలీపైనే పెత్తనం చలాయించే కొత్త కోడలు వచ్చిందనేది ప్రస్తుతం ఫిలిం సర్కిల్స్ లో హాట్ టాపిక్. ప్రస్తుతం ఆ ఫ్యామిలీ నుంచి మూడవతరం వారసులు సినిమాల్లో కొనసాగుతున్నారు. 

వారికి ఫిలిం ప్రొడక్షన్ సొంత బ్యానర్ కూడా ఉంది. సినిమా నిర్మాణం, ఇతర లావాదేవీల వ్యవహారాల్లో కొత్త కోడలు తలదూర్చుతున్నట్లు వార్తలు గుప్పుమంటున్నాయి. ఆ ఫ్యామిలిలో ఇద్దరు సీనియర్లని పక్కన పెట్టి మరీ ఆమె బిజినెస్ డీల్స్ చేస్తోందట. నెమ్మదిగా ఫ్యామిలీని, బిజినెస్ ని తన గుప్పెట్లోకి తెచ్చుకునే ప్రయత్నం చేస్తోందట. 

ఇప్పటివరకు నిర్మాణ సంస్థని విజయవంతంగా నడిపిస్తున్న ఆ ఫ్యామిలీ సీనియర్లకు ఆమె ప్రాధాన్యత ఇవ్వడం లేదట. ఫిలిం ప్రొడక్షన్ వ్యవహారాలు చూసుకోవడానికి ఆమె తన సొంత వ్యక్తిని నియమించుకుందట. ఇదంతా ఆ ఫ్యామిలీకి ఇబ్బందికరంగా మారినట్లు తెలుస్తోంది. 

చిత్ర పరిశ్రమకు చెందిన చాలా కుటుంబాల్లో లేడీస్ ఫిలిం ప్రొడక్షన్ లో రాణిస్తున్నారు. కానీ ఈమె మాత్రం దూకుడుగా వ్యవహరిస్తోందట. సీనియర్లని పెట్టుకుని ఆమె దూకుడు ఏంటి అంటూ టాలీవుడ్ లో చర్చ మొదలైంది. తన ఆధిపత్యం గురించి టాలీవుడ్ మొత్తం చెప్పుకోవాలని భావిస్తుందో ఏమో మరి! 

Follow Us:
Download App:
  • android
  • ios