బాలీవుడ్ దర్శకుడు ఓమ్ రౌత్ ప్రభాస్ తో ఆదిపురుష్ మూవీ ప్రకటించిన నాటి నుండి అనేక ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. ఆదిపురుష్ మూవీ రామాయణం ఆధారంగా తెరకెక్కుతుంది. ఈ చిత్రంలో ప్రభాస్ రామునిగా నటించడం విశేషం. ఇక రామాయణంలో రాముని శత్రువు, ప్రధాన ప్రతినాయకుడు రావణుడిగా సైఫ్ అలీ ఖాన్ చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక రాముని తోడు సీతగా చేసే హీరోయిన్ ఎవరనే దానిపై స్పష్టత లేదు. ఈ పాత్ర కోసం అనేకమంది హీరోయిన్స్ పేర్లు తెరపైకి వస్తున్నాయి. 

కాగా ఆదిపురుష్ కి సంబంధించి ఓ క్రేజీ న్యూస్ బయటికి వచ్చింది. ఈ చిత్రంలో ప్రభాస్ పెదనాన్న గారైన కృష్ణంరాజు ఓ కీలక పాత్ర చేస్తున్నారట. ఈ పౌరాణిక గాథలో కృష్ణం రాజు కూడా ఓ రోల్ లో మెరవనున్నారనేది కథనాల సారాంశం. ఇక గతంలో హీరో కృష్ణం రాజు అనేక పౌరాణిక పాత్రలు చేయడం జరిగింది. ఈ వార్తపై ఎటువంటి అధికారిక ప్రకటన లేకున్నప్పటికీ ప్రముఖంగా వినిపిస్తుంది. 

కాగా కృష్ణం రాజు బిల్లా, రెబల్ చిత్రాలలో ప్రాధాన్యం ఉన్న పాత్రలలో నటించడం జరిగింది. బిల్లా పాజిటివ్ టాక్ తెచ్చుకోగా, రెబల్ మాత్రం ప్లాప్ అయ్యింది. సెంటిమెంట్ పరంగా ప్రభాస్ మూవీలో కృష్ణం రాజు నటించడం ఆయనకు కలిసి రాలేదు. మరి వందల కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న సినిమా కోసం ప్రభాస్ ఈ రిస్క్ చేస్తాడా అనే డౌట్ కొడుతుంది. ఇక ఆదిపురుష్ వచ్చే ఏడాది చివర్లో సెట్స్ పైకి వెళ్లనుంది.