కరోనా వైరస్ ప్రభావం అన్ని రంగాల పైన పడిన  సంగతి తెలిసిందే..ముఖ్యంగా సినీ పరిశ్రమ విషయానికి వస్తే థియేటర్లును మూసివేశారు. దానికి తోడు సినిమా షూటింగ్ లు కూడా వాయిదా పడ్డాయి.

ఈ క్రమంలో ఇండస్ట్రీనే నమ్ముకున్న సినీ కార్మికుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది.. ఈ నేపథ్యంలో వారిని ఆదుకునేందుకు సినీ పరిశ్రమలోని నటులు ముందుకు వస్తున్నారు.

ఈ మేరకు మెగాస్టార్ చిరంజీవి ఆధ్వర్యంలో కరోనా క్రైసిస్ ఛారిటీ (సి.సి.సి.) ప్రారంభించారు. కరోనా క్రైసిస్‌ ఛారిటీ (సీసీసీ)కి విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. 

మరికొందరు ముఖ్యమంత్రి సహాయి నిధికి తమ విరాళాలను పంపి తమ దాతృత్వం చాటుకుంటున్నారు.  రాంచరణ్, ఎన్టీఆర్, మహేశ్ బాబు లాంటి స్టార్ నుంచి నుంచి కార్తికేయ, విశ్వక్షేన్ లాంటి ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న హీరోల వరకూ విరాళాలు ఇచ్చారు.

అలాగే సహాయన నటులైన... బ్రహ్మాజీ, వెన్నెల కిషోర్ తదితర నటులు తమదైన స్థాయిలో సి.సి.సి.కి విరాళాలు ఇచ్చారు. అయితే అందరూ తమదైన శైలిలో విరాళాలు ప్రకటిస్తూంటే బాలయ్య, బ్రహ్మీ విరాళాలు గురించి మాత్రం ఎక్కడా వినపడటం లేదు. 

ఈ విషయాలని కొందరు సోషల్ మీడియాలో హైలెట్ చేస్తూంటే,మరికొంతమంది మీడియాలో మాట్లాడుతున్నారు. అయితే విరాళాలు అనేవి వారి వారి వ్యక్తిగతం. ఖచ్చితంగా ఇవ్వాలనే రూల్ లేదు. కాకపోతే  అదే ఇండస్ట్రీలో ఉంటూ ఎదిగిన వాళ్లనుంచి ఆశిస్తూంటారు.

బాలయ్య త్వరలో భారీ మొత్తం ప్రకటించబోతున్నారని వార్తలు వినపడుతున్నాయి. అవి ఎంతవరకూ నిజమో తెలియదు. అయితే రెమ్యునేషన్ విషయంలో ముక్కు పిండి వసూలు చేసే బ్రహ్మానందం మాత్రం ఎక్కడా ఈ సమయంలో కనపడకపోవటం చాలా చోట్ల చర్చనీయాంశం అయ్యింది.

వడివేలు సైతం అక్కడ తమిళనాట...ఓ వీడియోని రిలీజ్ చేసి,కరోనా పై పోరాటానికి చేయూత ఇచ్చారు. అలాంటి పని కూడా బ్రహ్మీ చేయలేకపోయారా అని అంటున్నారు.