Asianet News TeluguAsianet News Telugu

కాపీ.. కాపీ.. చరణ్-శంకర్ మూవీపై కంప్లైంట్.. కథ ఎవరిదంటే..

గత కొన్నేళ్లుగా దిగ్గజ డైరెక్టర్ శంకర్ కు అసలు టైం బాగాలేదు అనేది వాస్తవం. అడ్డంకులు లేకుండా ఏ పని పూర్తి కావడం లేదు. కొన్ని పనులు మధ్యలోనే ఆగిపోతున్నాయి.

Copy allegations filed against Director Shankar for RC15
Author
Hyderabad, First Published Sep 3, 2021, 9:21 AM IST

గత కొన్నేళ్లుగా దిగ్గజ డైరెక్టర్ శంకర్ కు అసలు టైం బాగాలేదు అనేది వాస్తవం. అడ్డంకులు లేకుండా ఏ పని పూర్తి కావడం లేదు. కొన్ని పనులు మధ్యలోనే ఆగిపోతున్నాయి. కొన్ని నెలల క్రితం శంకర్, రాంచరణ్ చిత్రానికి అధికారికంగా ప్రకటన వచ్చింది. 

రాజమౌళి తర్వాత మరో క్రేజీ డైరెక్టర్ తో చరణ్ పనిచేస్తున్నాడని మెగా ఫ్యాన్స్ సంబరపడ్డారు. కానీ ఈ చిత్రానికి వరుస అడ్డంకులు ఎదురవుతున్నాయి. శంకర్ తమ కమిట్మెంట్స్ పూర్తి చేయకుండా చరణ్ చిత్రాన్ని చేసేందుకు వీలు లేదు అంటూ లైకా సంస్థ ఫిర్యాదు చేసింది. ఆ వివాదం నుంచి శంకర్ ఎలాగో బయట పడ్డాడు. 

తాజాగా మరో వివాదం మొదలైంది. రాంచరణ్ తో మూవీ కోసం శంకర్ కథని దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ నుంచి తీసుకున్నారట. దీనితో స్టోరీ డెవెలప్మెంట్ లో కార్తీక్ సుబ్బరాజ్ కూడా ఇన్వాల్వ్ అయ్యారు. ఇక్కడే అసలు వివాదం మొదలయింది. ఆ కథ తనది అంటూ కార్తీక్ సుబ్బరాజ్ అసిస్టెంట్ డైరెక్టర్ సెల్లముత్తు తెరపైకి వచ్చాడు. 

తన కథని కాపీ చేసి రాంచరణ్ తో సినిమా చేస్తున్నారు అని దక్షణ భారత సినీ రచయితల సంఘాన్ని సెల్లముత్తు ఆశ్రయించాడు. ఈ మేరకు శంకర్ పై ఫిర్యాదు నమోదు చేశాడు. తనని కనీసం సంప్రదించకుండా.. కథకు రెమ్యునరేషన్ కూడా ఇవ్వకుండా సినిమా మొదలు పెడుతున్నారు అని సెల్లముత్తు రచయితల సంఘం ముందు వాపోయాడు. 

దీనిపై విచారణ జరుపుతాం అని రచయితల సంఘం హామీ ఇచ్చింది. ఇరువురి వాదన విన్న తర్వాత తీర్పు ఇస్తామని తెలిపారు. సో.. చరణ్, శంకర్ మూవీకి మరో బలమైన అడ్డంకి ఎదురైనట్లు అయింది. ఈ వివాదాన్ని ఎలా పరిష్కరిస్తారో చూడాలి. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా.. తమన్ సంగీతం అందిస్తున్నాడు. కియారా అద్వానీ హీరోయిన్. అంజలి, మలయాళీ సీనియర్ నటుడు జయరాం కీలక పాత్రల్లో నటించబోతున్నట్లు తెలుస్తోంది. 

Follow Us:
Download App:
  • android
  • ios