ఒకటైమ్ లో అల్లరి నరేష్ తో సినిమా అంటే థియోటర్స్ నవ్వులతో దద్దరిల్లేవి. నరేష్ సినిమా అంటే దర్శక నిర్మాతలకి మినిమం గ్యారెంటీ అనే ఓ లెక్క ఉండేది. కానీ శ్రీనువైట్ల పుణ్యమా అని పెద్ద హీరోలంతా యాక్షన్ కామెడీలు చేసి,నవ్వించేస్తూంటే...పనిగట్టుకుని నరేష్ సినిమాలకు వెళ్లేవాళ్లు తగ్గిపోయారు. దానికి తోడు నరేష్ సినిమాలంటే స్ఫూఫ్ లు అనే నమ్మకం చూసేవారిలో ఏర్పడింది.ఇలా రకరకాల కారణాలతో వరుస సినిమాలు ఫ్లాప్ అవడంతో సినిమాలు తగ్గించాడు నరేష్.

ఆ తర్వాత వంశీ పైడిపల్లి దర్సకత్వంలో మహేష్ బాబు హీరోగా వచ్చిన మహర్షి సినిమాలో ఓ ముఖ్యమైన పాత్రలో కనిపించాడు.  ఆ పాత్రకు గాను నరేష్ కి మంచి పేరు వచ్చింది. సినిమా సక్సెస్ మీట్ లో నరేష్ మాట్లాడుతూ నాలుగు సంవత్సరాలు అయింది సక్సెస్ అనే మాట విని అంటూ భాగోద్వేగానికి లోను అయ్యి... ఇక తరవాత చేయబోయే సినిమాలు కథలో ఆచితూచి వ్యవహరిస్తున్నాడు నరేష్. అందులో భాగంగానే ఇప్పుడు కొత్త సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు నరేష్.

దర్శకుడు హరీష్ శంకర్ దగ్గర పని చేసిన విజయ్‌ కనకమేడల దర్శకుడిగా పరిచయం చేస్తూ ఓ సినిమా చేస్తున్నాడు నరేష్.నాంది అనే టైటిల్ తో రూపొందే ఆ చిత్రం నరేష్ కెరీర్ కు ప్లస్ అవుతుందా లేదో కానీ డైలమోలో పడేసిందని సమాచారం.  నరేష్ దగ్గరకి ఇప్పుడు సీరియస్ పాత్రలతో దర్శకులు కథలు చెప్పటానికి సిద్దపడుతున్నారట. దాంతో నరేష్ కు ఎప్పటిలాగే తను కామెడీ జానర్ లో సినిమాలు చేయాలా లేక, సీరియస్ సినిమాలను సీరియస్ గా ఎప్రోచ్ అయ్యిపోవాలా అనే విషయంలో తేల్చుకోలేకపోతున్నారట.

ముఖ్యంగా నాంది సినిమా తర్వాత ఏ ఇమేజ్ వస్తుందో చూసుకుని ముందుకు వెళ్లాలనుకుంటున్నారట. అయితే చిత్రంగా నరేష్ దగ్గరకు కామెడీ కథలు చెప్పేవాళ్లు కరువు అయ్యారట. ఒకళ్లు ఇద్దరు వస్తున్నా...వాళ్లంతా ఆగిపోయిన డైరక్టర్స్ ట. తన కెరీర్ లో ఇంత కన్ఫూజ్ ఎప్పుడూ ఫీలవలేదని అల్లరి నరేష్ వాపోతున్నారట.  అయితే సుడిగాడు నుంచే స్ఫూఫ్ ల వరద ప్రారంభమై అతన్ని ముంచేసిందని, దానికి తోడు ఫ్లాఫ్ ల్లో ఉన్నా తన రెమ్యునేషన్ కొంచెం కూడా తగ్గించుకోడని, ఇప్పటికి మధ్యాహ్నం నుంచే షూటింగ్ కు హాజరు అవుతాడని రకరకాల కంప్లైంట్స్ అతనిపై ఉన్నాయి.

హిట్ ల్లో ఉన్నంత కాలం ఎవరూ ఏమీ అనరు...కానీ ఒక్కసారి ఖాళీ పడితే అన్ని వైపుల నుంచి దాడి మాత్రం ప్రారంభమవుతుంది.  ‘నాంది’ విషయానికి వస్తే..విజయ్ కనకమేడల దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా జనవరి 27న మొదలైంది. ఫస్ట్ షెడ్యూల్ పూర్తయ్యి రెండవ షెడ్యూల్ ఈరోజే మొదలైంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, టైటిల్ పోస్టర్స్ సినిమాపై విపరీతమైన ఆసక్తిని పెంచాయి.  ఇందులో క్రైమ్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ మాత్రమే కాకుండా సామాజిక అంశాలు కూడా ఉండనున్నాయని చెప్తున్నారు. శరవేగంగా షూటింగ్ జరుపుతున్న టీమ్ వేసవికి చిత్రాన్ని విడుదల చేయాలని అనుకుంటున్నారు. శ్రీచరణ్ పాకాల సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని దర్శకుడు సతీష్ వెగేశ్న నిర్మిస్తున్నారు.