సినీ హీరో అల్లు అర్జున్‌ కొవిడ్‌ నిబంధనలు ఉల్లంఘించారని, ఆయనపై చర్యలు తీసుకోవాలని సమాచార హక్కు సాధన స్రవంతి ప్రతినిధులు బుధవారం ఆదిలాబాద్‌ జిల్లా నేరడిగొండ పోలీసు స్టేషన్‌లో కంప్లైంట్ చేశారు. కుంటాల జలపాతం సందర్శనను అధికారులు నిలిపివేసినా అల్లు అర్జున్‌ సహా పుష్ప సినిమా టీమ్ సభ్యులు కొవిడ్‌ నిబంధనలు ఉల్లంఘిస్తూ జలపాతాన్ని సందర్శించడంతోపాటు, తిప్పేశ్వర్‌లో ఫర్మిషన్స్  లేకుండా షూటింగ్ చేశారని’ ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దేవులపల్లి కార్తిక్‌రాజు కంప్లైంట్ లో పేర్కొన్నారు. 

కంప్లైంట్ ను స్వీకరించిన పోలీసులు, ప్రాథమిక విచారణ అనంతరమే దీనిపై కేసు నమోదు చేస్తామని వెల్లడించారు. ఇదే విషయమై ఆదిలాబాద్‌ డీఎఫ్‌ఓ ప్రభాకర్‌కు ఫిర్యాదు చేసేందుకు ఆ సంఘం ప్రతినిధులు వెళ్లారు. ఆయన అందుబాటులో లేకపోవడంతో కార్యాలయ సిబ్బందికి వినతిపత్రం అందించారు.

ఇక అల్లు అర్జున్, భార్య స్నేహా రెడ్డి మరియు ఫ్రెండ్స్‌తో కలిసి విహారయాత్రకు వెళ్లిన పిక్స్ ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే.  ఇది పర్శనల్ టూర్ కాదు.  అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందనున్న చిత్రం ‘పుష్ప’. పాన్‌ ఇండియా స్థాయిలో రూపొందనున్న ఈ సినిమా కోసం ఇప్పుడు బన్నీ లొకేషన్స్‌ సెర్చ్‌లో ఉన్నారు. అందులో భాగంగా బన్నీ ఆదిలాబాద్‌తో పాటు మహారాష్ట్రకు  వెళ్లారు. బన్నీ కుటుంబ సభ్యులు కూడా ఈ జర్నీలో ఆయనతో ట్రావెల్‌ అవుతున్నారు.

కుంటాల జలపాతంను సందర్శించిన బన్నీ ఆ తర్వాత మహారాష్ట్రలోని తిప్పేశ్వర్‌ అభయారణ్యంలో పర్యటిస్తున్నారు. క్యాజువల్ వేర్‌లో, రగ్గడ్ లుక్‌లో తనపేరుతో డిజైన్ చేసిన(AA) మాస్క్ ధరించి సఫారిలో ఫారెస్ట్‌లో తిరుగుతూ అక్కడివారికి సెల్ఫీలు కూడా ఇచ్చారు స్టైలిష్ స్టార్. డిసెంబర్ నుంచి ‘పుష్ప’ సినిమా రెగ్యులర్ షూటింగ్‌ ప్రారంభం కానుంది.. రష్మిక కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది.