హాస్య బ్రహ్మ బ్రహ్మానందం అద్భుతమైన నటుడే కాదు, ఆయనలో అద్భుతమైన పెయింటింగ్‌ ఆర్టిస్ట్ కూడా ఉన్నారు. ఇప్పటికే పలు మార్లు ఆయన ఆర్ట్ వేస్తూ కనిపించారు. పలు ఆర్ట్ చిత్రాలను పంచుకున్నారు. గతంలో శ్రీరాముడు ఆంజనేయుడిని హత్తుకున్న ఫోటోని పంచుకున్నారు. తన మరో ఫోటోని పంచుకున్నారు. 

తాజాగా న్యూ ఇయర్‌ గిఫ్ట్ తన ఆర్ట్ ని పంచుకున్నారు. ఈ సారి శ్రీవెంకటేశ్వరస్వామి చిత్రాన్ని గీశారు. శ్రీవెంకటేశ్వర స్వామికి పూజారి పూజా చేస్తున్నట్టుగా ఉందీ ఆర్ట్. ప్రస్తుతం అది సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. ఆయన అభిమానులు దీన్ని షేర్‌ చేసుకుంటూ అభినందనలు తెలియజేస్తున్నారు. హాస్యబ్రహ్మాలోని ఇంతటి ఆశ్చర్యానికి గురి చేసే కోణాన్ని చూసి సంతోషిస్తున్నారు. 

ఇదిలా ఉంటే తనదైన హాస్యంతో దాదాపు నాలుగు దశాబ్దాలపాటు టాలీవుడ్‌ చిత్ర పరిశ్రమని తిరుగులేని విధంగా ఏలిన బ్రహ్మానందానికి ఇటీవల అవకాశాలు తగ్గిపోయాయి. కొత్త తరం కమెడీయన్స్ రావడం, బ్రహ్మానందానికి వయసు మీద పడటం, ఇలా అనేక కారణాలతో ఆయనకు సినిమాలు తగ్గాయి. అడపాదడపా కొన్ని సినిమాల్లో కనిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో తనలోని కొత్త కళలలకు ఊపిరిపోస్తున్నారు బ్రహ్మానందం.