Asianet News TeluguAsianet News Telugu

ఆహాలో కలర్ ఫోటో.. కన్‌ఫార్మ్ చేసిన చిత్రయూనిట్

ఇటీవ‌ల ప‌లు చిత్రాల్లో కామెడీతో ఆక‌ట్టుకున్న న‌టుడు సుహాస్, చాందీని చౌద‌రి జంట‌గా న‌టిస్తున్నారు. కమెడియన్‌ సునీల్ కీల‌క పాత్ర పోషిస్తున్నారు. వైవా హ‌ర్ష మ‌రో డిఫరెంట్‌ క‌నిపించ‌బోతున్నారు. ఇటీవ‌లే క‌ల‌ర్ ఫొటో టీమ్ విడుద‌ల చేసిన టీజ‌ర్ కు, సాంగ్ కి  ఆన్ లైన్ తో పాటు వివిధ వ‌ర్గాల ప్రేక్ష‌కుల నుంచి అనూహ్య స్పంద‌న ల‌భించింది.

Colour Photo's World Premiere on on aha!
Author
Hyderabad, First Published Sep 15, 2020, 8:35 PM IST

హృద‌య‌కాలేయం, కొబ్బ‌రిమ‌ట్ట చిత్రాల‌తో సినిమా ప్రేక్ష‌కుల్ని క‌డుపుబ్బ న‌వ్వించిన సూప‌ర్‌హిట్ నిర్మాణ‌సంస్థ‌ అమృత ప్రొడ‌క్ష‌న్ బ్యాన‌ర్ పై,  శ్ర‌వ‌ణ్ కొంక‌, లౌక్య ఎంట‌ర్ టైన్మెంట్స్ స‌మ‌ర్ప‌ణ‌లో సాయి రాజేష్ నీలం, బెన్నీ ముప్పానేని నిర్మాత‌లుగా సందీప్ రాజ్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన చిత్రం క‌ల‌ర్ ఫొటో. ఈ సినిమాతో సందీప్ ద‌ర్శ‌కుడిగా తెలుగు చిత్ర సీమ‌కు ప‌రిచయం అవుతున్నారు.

ఈ సినిమాలో ఇటీవ‌ల ప‌లు చిత్రాల్లో కామెడీతో ఆక‌ట్టుకున్న న‌టుడు సుహాస్, చాందీని చౌద‌రి జంట‌గా న‌టిస్తున్నారు. కమెడియన్‌ సునీల్ కీల‌క పాత్ర పోషిస్తున్నారు. వైవా హ‌ర్ష మ‌రో డిఫరెంట్‌ క‌నిపించ‌బోతున్నారు. ఇటీవ‌లే క‌ల‌ర్ ఫొటో టీమ్ విడుద‌ల చేసిన టీజ‌ర్ కు, సాంగ్ కి  ఆన్ లైన్ తో పాటు వివిధ వ‌ర్గాల ప్రేక్ష‌కుల నుంచి అనూహ్య స్పంద‌న ల‌భించింది. ఈ మూవీ టీజ‌ర్ కు యూట్యూబ్ లో  మిలియ‌న్లు వ్యూస్ వ‌చ్చాయి.

ఈ సినిమాకు కాల‌భైర‌వ సంగీతాన్ని అందిస్తున్నారు. ఇప్ప‌టికే టీజర్ లో ఉన్న బ్యాక్ గ్రౌండ్ స్కోర్  వివిధ మ్యూజిక్ ఫ్లాట్ ఫామ్స్ తో ట్రెండ్ అవుతున్న‌ట్లుగా క‌ల‌ర్ ఫొటో యూనిట్ స‌భ్యులు చెబుతున్నారు. ఈ సినిమా అక్టోబ‌ర్ 23న విజ‌య‌ద‌శ‌మి సంధ‌ర్బంగా విడుద‌ల చేయ‌టానికి నిర్మాత‌లు ముహుర్తం ఖ‌రారు చేశారు. ఎంట‌ర్‌టైన్‌మెంట్ ఇంటికొచ్చి ఇస్తాం మీ మొబైల్స్‌, టివి, లాప్‌టాప్ లు మా కోసం ఆన్ చేయండి చాలు ఇంటికి వ‌చ్చి న‌వ్వించ‌డం మాకు కొత్త కాదు అంటున్నాడు.. ద‌ర్శ‌కుడు సందీప్‌.

Follow Us:
Download App:
  • android
  • ios