కొన్ని పోరపాట్లు తిరిగి సరిదిద్దుకోలేని స్థాయిలో నష్టాన్ని కలిగిస్తాయి. తాజగా ఓ స్టార్ హీరోకు అలాంటి అనుభవమే ఎదురైంది. హాలీవుడ్ స్టార్ హీరో కెప్టెన్‌ అమెరికా ఫేం క్రిస్‌ ఇవాన్ పొరపాటున తన న్యూడ్ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. అయితే ఆ విషయాన్ని ఇవాన్ గుర్తించి ఆ ఫోటోను డిలీట్‌ చేసే సరికి అది వైరల్ అయ్యింది. ఈ ఫోటోల ఇవాన్‌ పూర్తి నగ్నంగా ఉండటంతో ఆయన అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

శనివారం రోజు ఇవాన్ తన సోషల్ మీడియా పేజ్‌లో ఓ వీడియోను షేర్ చేశాడు, అందులో ఇవాన్ తన స్నేహితులతో కలిసి సరదాగా గడుపుతున్నాడు, అయితే వీడియో చివర్లో ఇవాన్ మొబైల్‌లోని ఓ పర్సనల్‌ ఫోటో కూడా కనిపించింది. అందులో ఇవాన్ ప్రైవేట్‌ పార్ట్స్‌ను క్లోజ్‌గా ఫోకస్ చేసి ఉంది. దీంతో ఆ ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తుండగా, కొంత మంది నెటిజెనల్లు ట్రోల్ చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో ఇవాన్ పరువు కాపాడేందుకు అభిమానులు రంగంలోకి దిగారు. న్యూడ్ ఫోటోకు క్రియేటివ్‌గా మార్చి సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు. ఇక సినిమాల విషయానికి వస్తే ఇవాన్ అవెంజర్స్ దర్శకుడు రుస్సో బ్రదర్స్‌తో ఓ సినిమా చేసేందుకు ఓకె చెప్పాడు. ఈ ప్రాజెక్ట్‌ దాదాపు 200 మిలియన్‌ డాలర్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతుంది.