గుండెలో కనిపించిన మెగాస్టార్ చిరంజీవి ఫ్యాన్స్ కి షాక్ ఇచ్చారు. గుండు చేయించుకొని, గాగుల్స్ పెట్టుకొని అర్బన్ మాంక్ లుక్ లో చిరు సరికొత్తగా కనిపించారు. సడన్ గా బాస్ గుండు దర్శనం ఇవ్వడం ఏమిటీ, ఈ లుక్ వెనుక ఆంతర్యం ఏమిటని టాలీవుడ్ లో పెద్ద చర్చే జరిగింది. చిరు నెక్స్ట్ చేయనున్న మూవీ మేకప్ టెస్ట్ లో భాగమే ఈ లుక్ అని అందరూ భావించారు. కొందరైతే నిజంగా చిరు గుండు చేయించుకున్నారేమో అని భ్రమపడ్డారు. 

కాగా అందరి అనుమానాలకు తెరదించుతూ సోషల్ మీడియా ద్వారా చిరు తన లుక్ పై క్లారిటీ ఇచ్చారు. ఇంస్టాగ్రామ్ లో వీడియో షేర్ చేసిన చిరు ఆ గుండు వెనుక సీక్రెట్ బయటపెట్టారు. ఆ వీడియోలో మేకప్ ఆర్టిస్ట్స్ తమ స్కిల్స్ తో చాలా సహజంగా చిరును అర్బన్ మాంక్ లుక్ లోకి మార్చారు. ఆ లుక్ చాలా సహజంగా ఉండగా, టెక్నీషియన్స్ గంటల తరబడి వర్క్ చేసినట్లు తెలుస్తుంది. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

Thanks to all the technicians of the industry, who can make any look believable. Salute the magic of cinema!

A post shared by Chiranjeevi Konidela (@chiranjeevikonidela) on Sep 14, 2020 at 9:31pm PDT

'ఎటువంటి లుక్ అయినా సహజంగా, వాస్తవానికి దగ్గరగా తీర్చిదిద్దుతున్న సాంకేతిక నిపుణులకు ధన్యవాదాలు, ఈ సినీ మాయకు నా ధన్యవాదాలు' అని కామెంట్ కూడా పెట్టారు.  అందుబాటులోకి వచ్చిన సాంకేతిక, పెరిగిన నైపుణ్యాలతో మేకప్ ఆర్టిస్ట్స్ వెండితెరపై అద్భుతాలు చేస్తున్నారు. ఎటువంటి లుక్ అయినా, చాలా సహజంగా, ప్రేక్షకులు నమ్మే విధంగా తీర్చిద్దితున్నారు. తెలుగు పరిశ్రమలో రూపుదిద్దుకున్న 'అ' మూవీ మేకప్ విభాగంలో జాతీయ అవార్డు పొందిన సంగతి తెలిసిందే.