Asianet News TeluguAsianet News Telugu

నాగ్‌ బర్త్ డేః ప్రయోగాలతో హద్దులు చెరిపేసిన నటుడంటోన్న చిరు.. రూమర్స్ కి చెక్‌ పెట్టిన సమంత..

మన్మథుడిగా, కింగ్‌గా పేరు తెచ్చుకున్న నాగార్జున నేడు తన 62వ పుట్టిన రోజుని జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా సినిమా సెలబ్రిటీలు ఆయనకు బర్త్ డే విషెస్‌ తెలియజేస్తున్నారు.చిరంజీవి, మహేష్‌బాబు, సమంత,రవితేజ, శర్వానంద్‌, ప్రవీణ్‌ సత్తార్‌ వంటి వారు శుభాకాంక్షలు తెలిపారు.

chiru mahesh samantha raviteja and other stars send birthday wishes to king nagarjuna
Author
Hyderabad, First Published Aug 29, 2021, 2:33 PM IST

కింగ్‌ నాగార్జున నేడు(ఆగస్ట్ 29)తన 62వ పుట్టిన రోజుని జరుపుకుంటున్నారు. నిత్య మన్మథుడిలా ఉండే నాగ్‌కి 62ఏళ్లు అంటే ఎవరూ నమ్మలేకపోతున్నారు. తాజాగా ఆయన సెలబ్రిటీల నుంచి వరుసగా బర్త్ డే విషెస్‌లు వెల్లువెత్తుతున్నాయి. మెగా స్టార్‌ చిరంజీవి స్పందించి విషెస్‌ తెలిపారు. `జీవితాన్ని వచ్చినట్టుగా తీసుకునే, ప్రతి క్షణాన్ని ఎక్కువగా చేసే ఆల్ట్రా కూల్‌ వ్యక్తి. నిరంతరం ప్రయోగాలు చేస్తూ నటుడిగా హద్దులు చెరిపేసిన నటుడు. అన్నింటి కంటే ఎప్పటికీ ప్రియమైన స్నేహితుడు. పుట్టిన రోజు శుభాకాంక్షలు నాగార్జున` అని తెలిపారు చిరంజీవి. 

మరోవైపు సూపర్‌స్టార్‌ మహేష్‌ స్పందించారు. మంచి పరిపూర్ణమైన ఆరోగ్యం, సంతోషం కలగాలన్నారు. మరోవైపు సమంత సైతం తన మామకి ప్రత్యేకంగా బర్త్ డే విషెస్‌ తెలిపింది. `మీపై నాకున్న గారవం గురించి చెప్పడానికి పదాలు సరిపోవు. ఎప్పుడూ అందంగా, ఆరోగ్యంగా ఉండాలని మ‌న‌స్పూర్తిగా కోరుకుంటున్నాను. హ్యాపీ బర్త్‌డే మామ` అంటూ సమంత ట్వీట్‌ చేసింది.

ఇదిలా ఉంటే కొన్ని రోజులుగా సమంత వ్యక్తిగత జీవితంపై పలు రూమర్స్‌ చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. పెళ్లి తర్వాత నుంచి సమంత డిజిటల్‌ ప్లాట్‌ఫామ్స్‌ అన్నింటిలోనూ సమంత అక్కినేనిగా ఉండేది అయితే తాజాగా సోషల్‌ మీడియా అకౌంట్లలో సమంత.. అక్కినేని అనే పదాన్ని తొలగించింది. దీంతో  చైతూతో సామ్‌కి విభేదాలు తలెత్తాయా అన్న అంశాలు తెరపైకి వచ్చాయి. ఈ విషయంపై స్పందించిన సమంత అవన్నీ రూమర్స్‌ అని క్లారిటీ ఇచ్చింది. 

మరోవైపు రవితేజ, శర్వానంద్‌, ప్రవీణ్‌ సత్తారు,  ఇలా అనేక మంది  సెలబ్రిటీలు నాగ్‌కి బర్త్ డే శుభాకాంక్షలు తెలిపారు.

Follow Us:
Download App:
  • android
  • ios