అవును ..చిరంజీవి అటు సీనియర్స్ తోనూ, ఇటు జూనియర్స్ తోనూ కలిసి పని చేస్తున్నారు. అటు అనుభవం, ఇటు కొత్త ఆలోచనలను ఒకే సారి స్వాగతిస్తున్నారు. ఏ ఇతర తెలుగు హీరో కూడా ఒకేసారి అటువంటి ప్రయత్నం చేయటం లేదు. ఆయన తాజాగా తన సినిమా సంగీతం కోసం..తండ్రి,కొడుకులతో పనిచేస్తున్నారు. ఇంతకీ ఎవరా తండ్రి కొడుకులు, ఏమిటా సినిమాలో చూద్దాం. చిరంజీవి గట్స్ ని, ఆయన ఆలోచనలను మరోసారి మెచ్చుకుందాం.

ప్రస్తుతం మెగా స్టార్ చిరంజీవి తన తాజా చిత్రం ఆచార్య కోసం కొరటాల శివతో కలిసి పని చేస్తున్నారు. ఆ సినిమాకు ప్రముఖ సంగీత దర్శకుడు మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. వాస్తవానికి కొరటాల అన్ని సినిమాలకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం చేసుకుంటూ వచ్చారు. కానీ ఈ సినిమాకి మాత్రం చాలా మంది సంగీత దర్శకుల పేర్లు వినిపించి , చివరకు చిరు సలహాపై మణిశర్మను తీసుకున్నారు.

గతంలో మణిశర్మ చిరంజీవి సినిమాలకి ఆస్థాన సంగీత దర్శకుడిగా ఉండేవాడు. వారిద్దరి కాంబినేషన్ లో అనేక హిట్స్ వచ్చాయి. ఇప్పుడు మళ్ళీ ఈ కాంబినేషన్ ని రిపీట్ చేస్తూండటంతో మ్యూజికల్ ఫిల్మ్ హిట్ అని డిసైడ్ అయ్యిపోయారు ఫ్యాన్స్.దానికి తోడు ఈ మధ్య మణిశర్మ సంగీతం అందించిన లై, ఇస్మార్ట్ శంకర్ సినిమాలు బాగా హిట్టు అయ్యాయి. దీనితో మణి ఈజ్ బ్యాక్ అని చాలా మంది అన్నారు. 

ఇక ఈ విషయం  ప్రక్కన పెడితే చిరంజీవి రీసెంట్ గా వేదాళం రీమేక్ చేయటానికి కమిటయ్యారు. ఈ సినిమాని మెహర్ రమేష్ డైరక్ట్ చేస్తున్నారు. అనీల్ సుంకర తన ఏకె ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ఈ సినిమా చేస్తున్నారు. వచ్చే సంవత్సరం ప్రారంభంలో మొదలయ్యే ఈ సినిమాకు మణిశర్మ కుమారుడు మహతి స్వర సాగర్ ని  ఫైలైజ్ చేసినట్లు తెలుస్తోంది. ఇలా తండ్రి,కొడుకులిద్దరు తోనూ ఒకేసారి పనిచేస్తున్న ఘనతను అలా చిరంజీవి అందిపుచ్చుకున్నారు.