Asianet News TeluguAsianet News Telugu

పది మంది మేలుకోరే నిప్పుకణం, తోడబుట్టిన ఆశయంకి జన్మదిన శుభాకాంక్షలు

 పవన్ కి అన్న చిరంజీవి బర్త్ డే విషెస్ చాలా స్పెషల్. చిరంజీవి ట్విట్టర్ వేదికగా పవన్ కళ్యాణ్ కి ప్రత్యేకంగా బర్త్ డే విషెస్ తెలియజేశారు. పవన్ కళ్యాణ్ ఆశయం నెరవేరాలని ఆశీర్వదించారు.

chiranjeevi wishes a happy birthday to pawan kalyan his tweet getting viral
Author
Hyderabad, First Published Sep 2, 2021, 10:19 AM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేనాని నేడు 50వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఆయన డై హార్డ్ ఫ్యాన్స్ చాలా రోజుల క్రితమే సెలెబ్రేషన్స్ మొదలుపెట్టారు. నిన్న సాయంత్రం నుండి సోషల్ మీడియాపై దండెత్తి హోరెత్తిస్తున్నారు. పవన్ బర్త్ డే పురస్కరించుకొని అనేక సేవా కార్యక్రమాలు, ఈవెంట్స్ ప్లాన్ చేశారు. సినీ ప్రముఖులు సైతం పవన్ కి ప్రత్యేకంగా బర్త్ డే విషెస్ తెలియజేస్తున్నారు. 


కాగా పవన్ కి అన్న చిరంజీవి బర్త్ డే విషెస్ చాలా స్పెషల్. చిరంజీవి ట్విట్టర్ వేదికగా పవన్ కళ్యాణ్ కి ప్రత్యేకంగా బర్త్ డే విషెస్ తెలియజేశారు. పవన్ కళ్యాణ్ ఆశయం నెరవేరాలని ఆశీర్వదించారు.  ''చిన్నప్పటి నుంచి సమాజం గురించే కళ్యాణ్ ప్రతి ఆలోచన... ప్రతి అడుగు. పదిమందికి మేలు జరగాలని ప్రతి క్షణం పరితపించే నిప్పు కణం...కళ్యాణ్. అతని లక్ష్యం నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, తోడబుట్టిన ఆశయానికి పుట్టిన రోజు శుభాకాంక్షలు'' అంటూ ట్వీట్ చేశారు. 


ఆగస్టు 22న చిరంజీవి బర్త్ డే జరుపుకోగా, పవన్ కళ్యాణ్ స్వయంగా వచ్చి విషెష్ తెలిపారు. పవన్ ని చిరంజీవి ఆలింగనం చేసుకోవడంతో పాటు, ముద్దాడి ఆప్యాయత చాటుకున్నారు. ఇక పవన్ కి బర్త్ డే విషెస్ తెలియజేస్తూ చిరంజీవి చేసిన ట్వీట్ వైరల్ గా మారింది. మెగా అభిమానులు కామెంట్స్ రూపంలో తమ సంతోషం తెలియజేస్తున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios