మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ మూవీ ఆచార్య. దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. లాక్ డౌన్ ముందు వరకు ఆచార్య షూటింగ్ నిరవధికంగా సాగింది. కొరటాల 40శాతం షూటింగ్ వరకు పూర్తి చేశాడని సమాచారం. రెండు తెలుగు రాష్ట్రాలు షూటింగ్స్ కి పర్మిషన్ ఇచ్చినప్పటికీ కరోనా వ్యాప్తి మరింతగా ఉన్న నేపథ్యంలో ఎవరూ సాహసం చేయడం లేదు. అలాగే ప్రభుత్వ ఆంక్షల వలన భారీ సిబ్బందితో షూట్ నిర్వహించలేని పరిస్థితి నెలకొని ఉంది. 

ఐతే ఆచార్య షూటింగ్ కి బ్రేక్ పడి ఐదునెలలు దాటిపోయింది. ఈనేపథ్యంలో దర్శకుడు కొరటాల శివ షూటింగ్ వీలైనంత త్వరగా పూర్తి చేయాలనే ఆలోచనలో ఉన్నారు. కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ లో చరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. షూటింగ్ లేటయ్యే కొద్దీ నిర్మాణ వ్యయం మరింతగా పెరిగిపోయే అవకాశం ఉంది. అలాగే ఈఏడాదిలో విడుదల చేయాలనుకున్న ఆచార్య వచ్చే ఏడాది సంక్రాంతికి కూడా విడుదల కావడం అనుమానమే. దీనితో విడుదల మరింత ఆలస్యం అయ్యేలా కనిపిస్తుండగా షూటింగ్ త్వరగా మొదలుపెట్టాలని భావిస్తున్నారట. 

చిరు సైతం ఆచార్య షూటింగ్ మొదలుపెట్టాలని నిశ్చయించుకున్నారట. ఐతే చిరు ఆచార్య టెస్ట్ షూట్ నిర్వహించాలని డిసైడ్ అయ్యారట. షూటింగ్ లో పాల్గొననున్న సిబ్బందికి కరోనా టెస్టులు నిర్వహించడంతో పాటు, పరిమిత సిబ్బందితో షూటింగ్ ఎంత వరకు సాధ్యం అనే విషయాలను కూడా పరిశీలించనున్నారట. దసరాకు ముందే ఈ టెస్ట్ షూట్ పూర్తి చేయాల్సిందిగా కొరటాలను కోరారని సమాచారం అందుతుంది.