‘ఆచార్య’ చిత్రం ఈ సంవత్సరం రిలీజ్ అయ్యే సూచనలు లేకపోయినా ప్రతీ రోజూ వార్తల్లో నిలుస్తోంది. ముఖ్యంగా చిరంజీవి మీడియాతో టచ్ లో ఉండటంతో ఈ విశేషాలు బయిటకు వస్తున్నాయి. మీడియాకు ఆయన ఫుడ్ పెడుతున్నారు. అంతేకాక ఆచార్య చిత్రం గురించిన అనేక విశేషాలు, తెర వెనక జరిగిన సంఘటనలపై క్లారిటీ ఇస్తున్నారు. తాజాగా ఆయన త్రిష హఠాత్తుగా తమ ప్రాజెక్ట్ నుంచి బయిటకు వెళ్లటంపై మాట్లాడారు. ఎందుకు ఆమె ఆచార్య ని వదిలేసిందో చెప్పారు. అయితే త్రిష చెప్పిన వెర్షన్ వేరు, చిరు చెప్తున్న వెర్షన్ వేరు. ఏమిటా వెర్షన్స్ చూద్దాం.

చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘ఆచార్య’. ఈ చిత్రాన్ని రామ్‌చరణ్, నిరంజన్‌రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో త్రిషను హీరోయిన్ గా తీసుకున్నారు. అయితే క్రియేటివ్‌ డిఫెర్సెన్స్‌ వల్ల ‘ఆచార్య’ చిత్రం నుంచి తాను తప్పుకున్నట్లు త్రిష సోషల్‌ మీడియా ద్వారా త్రిష వెల్లడించారు. ‘‘కొన్నిసార్లు మొదట్లో మనకు చెప్పిన విషయాలు, చర్చలు మారిపోతుంటాయి.క్రియేటివ్‌ డిఫర్సెన్స్‌ వల్ల నేను చిరంజీవిగారి ‘ఆచార్య’ సినిమాలో నటించడం లేదు. త్వరలో ఓ ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌తో నా తెలుగు అభిమానులను కలుస్తాను’’ అని పేర్కొన్నారు త్రిష. 

అయితే ఇదే విషయమై చిరంజీవి ఈ రోజు మాట్లాడారు. నేను అందరితో మాట్లాడాను ఎవరికి ఆమెతో విభేదాలు లేవు అయిన తాను సినిమా నుండి తప్పుకుంది ఎందుకంటే... మణిరత్నం సినిమాలో ఆమెకు అవకాశం రావడంతో ఆ ఆచార్య నుండి తప్పుకున్నట్లుగా చిరంజీవి పేర్కొన్నాడు. అయితే ఆమె చెప్పిన విషయం ప్రకారం క్రియేటివ్ డిఫరెన్స్...చిరు చెప్పిన దాని ప్రకారం ..మణిరత్నం సినిమాలో ఆఫర్. ఏది నిజమో కేవలం ఆ నిర్మాతలకు,దర్శకులకు మాత్రమే తెలిసే అవకాసం ఉంది.

 2016లో ‘నాయికి’ అనే తమిళ, తెలుగు చిత్రం తర్వాత త్రిష అంగీకరించిన చిత్రం ‘ఆచార్య’. ఇప్పుడీ సినిమా నుంచి తప్పుకున్నారామె. ఇదిలా ఉంటే 2006లో వచ్చిన ‘స్టాలిన్‌’లో చిరంజీవి, త్రిష జంటగా నటించిన విషయం గుర్తుండే ఉంటుంది. అయితే ఇప్పుడు త్రిష స్థానంలో హీరోయిన్‌గా కాజల్‌ని తీసుకోవాలని అనుకుంటుందట చిత్రబృందం..ఇప్పటికే ఆమెతో సంప్రదింపులు జరిగాయని తెలుస్తోంది. త్వరలోనే కాజల్ కూడా ఈ మూవీ షూటింగ్‌లో పాల్గొననుందని తెలుస్తోంది. గతంలో చిరు, కాజల్ కాంబినేషన్ లో 'ఖైదీ 150' అనే సినిమా తెరకెక్కింది.