Asianet News TeluguAsianet News Telugu

తమిళనాడు సీఎంని కలిసిన మెగాస్టార్.. స్టాలిన్‌ పాలనపై ప్రశంసలు

సీఎంని కలిసిన చిరంజీవి పుష్పగుచ్ఛాన్ని అందించి ఆయన సీఎంగా ఎన్నికైన తర్వాత చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను అభినందించారు. ఈ సందర్భంగా సీఎం స్టాలిన్‌ సైతం తండ్రి, మాజీ సీఎం కరుణానిధి ప్రతిమని చిరంజీవికి అందజేశారు. 

chiranjeevi meet tamilnadu cm mk stalin
Author
Hyderabad, First Published Sep 1, 2021, 9:41 PM IST

మెగాస్టార్‌ చిరంజీవి తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్‌ని కలిశారు. బుధవారం ఆయన తమిళనాడు సీఎం ఆఫీస్‌లో స్టాలిన్‌ని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ కార్యక్రమంలో నటుడు, ఎమ్మెల్యే ఉదయనిధి స్టాలిన్‌ కూడా ఉండటం విశేషం. సీఎంని కలిసిన చిరంజీవి పుష్పగుచ్ఛాన్ని అందించి ఆయనకు సీఎంగా ఎన్నికైన తర్వాత చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను అభినందించారు. ఈ సందర్భంగా సీఎం స్టాలిన్‌ సైతం తండ్రి, మాజీ సీఎం కరుణానిధి ప్రతిమని చిరంజీవికి అందజేశారు. 

ఈ ఫోటోలను తాజాగా మెగాస్టార్‌ పంచుకున్నారు. తమిళనాడు సీఎంపై ప్రశంసలు కురిపించారు. గౌరవనీయులైన తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్‌ని కలవడం ఆనందంగా ఉందన్నారు. అనేక మంచి కార్యక్రమాలతో ముందుకు సాగుతున్నందుకు ఆయన్ని అభినందించారు. మంచి విజన్, అంకితభావంతో ప్రజల నాయకుడిగా స్టాలిన్‌ ఉన్నారని, కరోనా కాలంలోనూ సమర్థవంతమైన పాలనని అందించారని అభినందించారు. 

చిరంజీవి ప్రస్తుతం `ఆచార్య` చిత్రంలో నటిస్తున్నారు. ఇది విడుదలకు సిద్ధంగా ఉంది. దీంతోపాటు `గాడ్‌ఫాదర్‌`, అలాగే `భోళాశంకర్‌` చిత్రాల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈరెండు చిత్రాలు షూటింగ్‌ దశలో ఉన్నాయి.

Follow Us:
Download App:
  • android
  • ios