Asianet News Telugu

ఆశయాన్ని దృశ్యంగా మలిచే దార్శనికత కొరటాల సొంతమంటోన్న చిరంజీవి.. చెర్రీ విషెస్‌

దర్శకుడు కొరటాల శివ పుట్టిన రోజు నేడు(మంగళవారం). ఈ సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు బర్త్ డే విషెస్‌ చెబుతున్నారు. ఎన్టీఆర్‌ స్నేహితుడిగా అభివర్ణిస్తూ విషెష్‌ తెలిపారు. చిరంజీవి, రామ్‌చరణ్‌ సైతం స్పందించారు.

chiranjeevi and ram charan birthday wishes to director koratala siva  arj
Author
Hyderabad, First Published Jun 15, 2021, 4:34 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

సామాజిక అంశాలను కమర్షియల్‌ యాంగిల్‌లో చెప్పడంలో దిట్ట కొరటాల శివ. తాను సృష్టించిన పాత్రలతో సమాజంలో మార్పు తేవాలని తపించేవాడు. `మిర్చి`, `శ్రీమంతుడు`, `జనతా గ్యారేజ్‌`, `భరత్‌ అనే నేను` ఈ చిత్రాల్లోని పాత్రలన్నీ సమకాలీన సమాజంలోని మార్పుని కోరుకుంటాయి. రీల్‌ మీదే కాదు, రియల్‌ లైఫ్‌లోనూ మార్పుని కోరుకుంటాయి. ఆ ప్రభావాన్ని సమాజంపై కూడా పడేలా చేస్తాయి. మహేష్‌తో చేసిన `శ్రీమంతుడు` సినిమానే అందుకు నిదర్శనం. ఇది ఊర్లు దత్తత తీసుకోవడమనే కాన్సెప్ట్ పరంగా ఎంతటి ప్రభావాన్ని చూపించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. 

తనకంటూ ఓ లక్ష్యాన్ని, తన భావాలను అవధుల్లేని సినిమా మాధ్యమం ద్వారా ప్రజలకు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు దర్శకుడు కొరటాల శివ. ఆయన పుట్టిన రోజు నేడు(మంగళవారం). ఈ సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు బర్త్ డే విషెస్‌ చెబుతున్నారు. ఎన్టీఆర్‌ స్నేహితుడిగా అభివర్ణిస్తూ విషెష్‌ తెలిపారు. ఇక మెగాస్టార్‌ చిరంజీవి సైతం స్పందించారు. ఆయన బర్త్ డే శుభాకాంక్షలు తెలిపారు. `ఆ కలానికి సమాజంలో మార్పు తేవాలనే తపన ఉంది. ఆ దర్శకుడికి ఆశయాన్ని దృశ్యంగా మలిచే దార్శనికత ఉంది. `ఆచార్య` సృష్టికర్త కొరటాల శివకి పుట్టిన రోజు శుభాకాంక్షలు` అని ట్వీట్‌ చేశారు చిరంజీవి. 

ఆయనతోపాటు `ఆచార్య` చిత్రంలో కీలక పాత్ర పోషిస్తూ, సినిమా నిర్మాణం చూసుకుంటున్న రామ్‌చరణ్‌ కూడా ఓ అద్భుతమైన ఫోటోని పంచుకుంటూ బర్త్ డే విషెస్‌ తెలియజేశారు. అలాగే దేవిశ్రీ ప్రసాద్‌ సైతం విషెస్‌ తెలిపారు.

చిరంజీవి హీరోగా కొరటాల శివ `ఆచార్య` చిత్రాన్ని రూపొందిస్తున్న విషయం తెలిసిందే. కాజల్‌ కథానాయికగా నటిస్తుంది. ఇందులో రామ్‌చరణ్‌ కీలక పాత్ర పోషిస్తుంది. ఆయన సరసన పూజా హెగ్దే హీరోయిన్‌. ఈ సినిమాని నిరంజన్‌రెడ్డితో కలిసి రామ్‌చరణ్‌ నిర్మిస్తున్నారు. సినిమా షూటింగ్‌ ఆల్మోస్ట్ పూర్తి చేసుకుంది. కొన్ని సన్నివేశాలు పెండింగ్‌లో ఉన్నాయి. త్వరలోనే అవి పూర్తి చేసి విడుదలకు ప్లాన్‌ చేస్తున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios