దర్శకుడు సందీప్ వంగా, సింగర్ చిన్మయి మధ్య వివాదం మరింత ముదురుతోంది. ఇటీవల సందీప్.. ఇద్దరు ప్రేమికుల మధ్య ఒకరినొకరు కొట్టుకునేంత స్వేచ్చలేకపోతే వారి మధ్య ప్రేమ ఉంటుందని తాను అనుకోనని ఆయన చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగింది.

సింగర్ చిన్మయి.. సందీప్ చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు. సందీప్ వంగ చేసిన కామెంట్స్ ను ట్విట్టర్ ద్వారా షేర్ చేసి.. కొట్టడం ప్రేమకు చిహ్నమా అని ప్రశ్నించారు. దీంతో చిన్మయిని కొంతమంది నెటిజన్లు టార్గెట్ చేసి ట్రోల్ చేస్తున్నారు. ఆమె వ్యక్తిగత జీవితంపై వల్గర్ కామెంట్స్ చేస్తూ పోస్ట్ లు పెడుతున్నారు.

వీటిపై స్పందిస్తూ చిన్మయి మరో వీడియో విడుదల చేసింది. తన టైం లైన్ లో ట్వీట్స్పెట్టి వ్యక్తిగత అభిప్రాయాన్ని వ్యక్తపరిచినందుకు చాలా మంది రకరకాలుగా రియాక్ట్ అవుతున్నారని.. లేనిపోని గోల చేస్తున్నారని మండిపడింది. ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తులు ఏదైనా మాట్లాడినప్పుడు దానిపై అభిప్రాయం చెప్పడమనేది సాధారణ  విషయమని.. తను కూడా అదే చేసినట్లు చెప్పింది.

ఆ మాత్రం దానికి నీ భర్త నీకు విడాకులు ఇవ్వలేదా..? నీ భర్త ఇంకా చనిపోలేదా..? నువ్ ఇంకా బతికే ఉన్నావా..? అని అడుగుతున్నారని ఫైర్ అయింది. తెలుగులో పిచ్చి బూతులు తిడుతున్నారని.. మూడో ప్రపంచయుద్ధం వచ్చినంతగా ఫీల్ అయిపోతున్నారని చెప్పింది. ఎవరెన్ని మాటలు అన్నా.. తనపై ఏ మాత్రం ఎఫెక్ట్ చూపవని ఆ విషయం గ్రహిస్తే  మంచిదని అన్నారు.