ప్రముఖ గాయని చిన్మయి ఇటీవల ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది. మీటూ ఉద్యమం నేపథ్యంలో చిన్మయి, ప్రముఖ రచయిత వైరముత్తు మధ్య వివాదం సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. చిత్ర పరిశ్రమ నుంచి ఎన్ని ఒత్తిళ్లు వస్తున్నా చిన్మయి మాత్రం ఒంటరిగా ఎదుర్కొంటోంది. చిన్మయి చిత్ర పరిశ్రమలో మహిళలకు ఎదురవుతున్న సమస్యల గురించి సోషల్ మీడియాలో స్పందిస్తూ ఉంటుంది. 

తాజాగా చిన్మయి చేసిన ఓ ట్వీట్ వైరల్ అవుతోంది. సోషల్ మీడియాలో చిన్మయిని ఓ వ్యక్తి న్యూడ్ ఫోటోలు పంపాలని కోరాడు. అతడి ప్రశ్నకు చిన్మయి ఏమాత్రం ఆగ్రహం వక్తం చేయకుండా అదిరిపోయేలా సమాధానం ఇచ్చింది. అతడు అడిగినట్లుగానే న్యూడ్ పిక్స్ పంపింది. కానీ అవి అతడు కోరుకున్న ఫోటోలు కాదు. నాకు నచ్చిన న్యూడ్ పిక్స్ ఇవే అంటూ చిన్మయి లిప్ స్టిక్ ఫోటోలు షేర్ చేసింది. 

హ్యూమన్ స్కిన్ కలర్ లో ఉండే కొన్ని లిప్ స్టిక్స్ ని న్యూడ్ లిప్ స్టిక్స్ అని పిలుస్తారు. ఆ దృశ్యాలని చిన్మయి అతడికి షేర్ చేసింది. దీనితో చిన్మయి సమాధానానికి నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. అతడితో జరిగిన సంభాషణని చిన్మయి ట్విటర్ లో షేర్ చేసింది.