'చిలసౌ' తొలిరోజు కలెక్షన్స్!

chilasow movie first day collections
Highlights

ఆంధ్ర,కృష్ణా జిల్లాల్లో ఈ సినిమా తొలిరోజు 2,39,392 లక్షల షేర్ ను రాబట్టిందని సమాచారం. సుశాంత్ హీరో కావడంతో సినిమాకు ఓపెనింగ్స్ సరైన స్థాయిలో లేనప్పటికీ.. సినిమాకు వచ్చిన పాజిటివ్ టాక్ తో శని, ఆదివారాలు భారీ వసూళ్లు సాధించే ఛాన్స్ ఉందని తెలుస్తోంది

హీరో సుశాంత్ నటించిన లేటెస్ట్ చిత్రం 'చిలసౌ'. రాహుల్ రవీంద్రన్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాతో రుహానీ శర్మ హీరోయిన్ గా పరిచయమైంది. రొమాంటిక్, లవ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చి సక్సెస్ ఫుల్ టాక్ తో దూసుకుపోతుంది. ఓవర్సీస్ లో దాదాపు 75 లొకేషన్స్ లో ఈ సినిమాను విడుదల చేశారు. అక్కడ ప్రీమియర్ షో ద్వారా 25,797 డాలర్లు వసూలు చేసింది.

కేవలం మౌత్ టాక్ ద్వారా ఈ సినిమా 3.5కోట్ల వరకు ప్రీరిలీజ్ బిజినెస్ సాధించినట్లు ట్రేడ్ విశ్లేషకులు చెబుతున్నారు. అందులో రూ.50 లక్షల వరకు షేర్ ఉండవచ్చని అంటున్నారు. ఇక తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే.. ఆంధ్ర,కృష్ణా జిల్లాల్లో ఈ సినిమా తొలిరోజు 2,39,392 లక్షల షేర్ ను రాబట్టిందని సమాచారం.

సుశాంత్ హీరో కావడంతో సినిమాకు ఓపెనింగ్స్ సరైన స్థాయిలో లేనప్పటికీ.. సినిమాకు వచ్చిన పాజిటివ్ టాక్ తో శని, ఆదివారాలు భారీ వసూళ్లు సాధించే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. ఈ సినిమాతో పాటు విడుదలైన 'గూఢచారి' సినిమా దీనికి వసూళ్ల పరంగా గట్టి పోటీనే ఇస్తుంది. 
 

loader