ఇప్పటికే సినిమా ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ ఉందని పలువురు తారలు ఆరోపిస్తున్నారు. తమ కోరికలు తీర్చుకోవడం కోసం కొందరు వ్యక్తులు అమ్మాయిలను వాడుకుంటున్నారనే ఆరోపణలు రోజురోజుకి ఎక్కువవుతున్నాయి.

సినిమా అవకాశాలు ఇప్పిస్తామని అమ్మాయిలను వ్యభిచారంలోకి దింపడం వంటి చర్యలకు పాల్పడుతున్న వ్యక్తి గుట్టును ఓ మహిళ బయటపెట్టింది. చెన్నైకి చెందిన ఓ మహిళ మోహన్ అనే సినీ కాస్టింగ్ డైరెక్టర్ అవకాశాల ఆశ చూపించి చాలా మంది మహిళలను వ్యభిచారంలోకి దింపుతున్నారని ఆరోపించింది.

ఈ విషయాలను బయటపెడితే తనతో గడిపిన రాసలీలల దృశ్యాలను సోషల్ మీడియాలో విడుదల చేస్తానని బెదిరించడం సదరు మహిళ భయపడినట్లు చెప్పింది. మోహన్ అవకాశాల పేరుతో అమ్మాయిలను వాడుకుంటున్న ఆధారాలు తన వద్ద ఉన్నాయని, ఈ విషయంలో పోలీసులకు కంప్లైంట్ చేస్తానని వెల్లడించింది.

తన రక్షణ కోసం ఇప్పుడు తనవివరాలను బయటపెట్టడం లేదని పేర్కొని మోహన్ రాసలీలలకు సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.