యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఇటీవలే రాధే శ్యామ్ ఇటలీ షెడ్యూల్ పూర్తి చేసుకొని వచ్చారు. కారణం ఏదైనా కానీ ప్రభాస్ హైదరాబాద్ లోని పూరి జగన్నాధ్ ఆఫీస్ కి వెళ్లారు. అక్కడ ఛార్మి కౌర్ పెట్ డాగ్ పూచ్ తో ఆయన ఫోటో దిగడం జరిగింది. సదరు ఫోటో తన ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేయగా ఇంటర్నెట్ ని షేక్ చేస్తుంది. సోషల్ మీడియాలో ప్రభాస్ ఫోటో హాట్ టాపిక్ గా మారింది. నెటిజెన్స్ సూపర్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. 

బ్లాక్ అవుట్ ఫిట్ లో ఉన్న ప్రభాస్ అలస్కన్ మాలామ్యూట్ డాగ్ తో రాయల్ స్టిల్ ఇచ్చారు. తన పెట్ డాగ్ తో డార్లింగ్ ప్రభాస్ ఫోటోకి పోజివ్వడం ఛార్మి చాల ప్రత్యేకంగా ఫీలవుతున్నట్లు ఉన్నారు. గతంలో ఛార్మి, ప్రభాస్ పౌర్ణమి సినిమాలో కలిసి నటించడం జరిగింది. ఇక పూరి ఆఫీస్ లో ప్రభాస్ కనిపించడంతో కొత్త సినిమా చర్చలు ఏమైనా జరుగుతున్నాయా అనే అనుమానం ఫ్యాన్స్ వ్యక్తం చేస్తున్నారు. 

దాదాపు మరో మూడేళ్ళ వరకు ప్రభాస్ బిజీ అని చెప్పాలి. ప్రస్తుతం రాధే శ్యామ్ పూర్తి చేస్తున్న ప్రభాస్ ఆ వెంటనే దర్శకుడు నాగ్ అశ్విన్ మూవీ స్టార్ట్ చేస్తారు. 500 కోట్లకు పైగా బడ్జెట్ తో ఈ చిత్రం తెరకెక్కనుండగా దీపికా పదుకొనె హీరోయిన్ గా నటించడం విశేషం. దీనితో పాటు బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ తో ఆదిపురుష్ మూవీ పూర్తి చేయాల్సి ఉంది. మొదటిసారి పౌరాణిక చిత్రం చేయనున్న ప్రభాస్, రామునిగా కనిపించడం ఆసక్తి రేపుతోంది. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

#Darling with my 9 months old baby boy ♥️ . . . @actorprabhas #alaskanmalamute @puriconnects

A post shared by Charmmekaur (@charmmekaur) on Nov 10, 2020 at 2:59am PST