ఆర్ ఆర్ ఆర్ తరువాత చరణ్ చేసే ప్రాజెక్ట్ ఏమిటనేది ఆయన ఫ్యాన్స్ లో మిలియన్ డాలర్ ప్రశ్నగా ఉంది. మిగతా స్టార్ హీరోలందరూ వరుసగా క్రేజీ ప్రాజెక్ట్స్ లైన్ లో పెట్టగా, చరణ్ మాత్రం మౌనంగానే ఉన్నారు. ఆర్ ఆర్ ఆర్ తో పాటు, ఆచార్య మూవీలో నటిస్తున్న చరణ్ కొత్త మూవీ ప్రకటించాల్సి ఉంది. వెంకీ కుడుముల, సురేంధర్ రెడ్డి, వంశీ పైడిపల్లి వంటి దర్శకుల పేర్లు చరణ్ నెక్స్ట్ మూవీ కోసం వినిపించాయి. అయితే అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. 

తాజా సమాచారం ప్రకారం వంశీ పైడిపల్లితో ఆల్మోస్ట్ చరణ్ ప్రాజెక్ట్ కన్ఫర్మ్ అయినట్లు సమాచారం. వంశీ చెప్పిన కథకు చరణ్ కన్విన్స్ కావడంతో పాటు ప్రాజెక్ట్ ఒకే చేసేశారట. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన కూడా రానుందని టాలీవుడ్ టాక్. గతంలో వీరిద్దరి కాంబినేషన్ ఎవడు మూవీ రావడం జరిగింది. ఎవడు పాజిటివ్ టాక్ సొంతం చేసుకోవడంతో పాటు ఓ మోస్తరు విజయాన్ని నమోదు చేసుకుంది. ఎవడు మూవీలో అల్లు అర్జున్, బన్నీ క్యామియో రోల్స్ చేసిన సంగతి తెలిసిందే. 

వీలైనంత త్వరగా చరణ్ ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కించనున్నాడు. ఆర్ ఆర్ ఆర్ తో పాటు ఆచార్య మూవీ చరణ్ పూర్తి చేయాల్సిన ప్రాజెక్ట్స్ లిస్ట్ లో ఉన్నాయి. కాబట్టి వచ్చే ఏడాది వంశీ పైడిపల్లి మూవీ సెట్స్ పైకి వెళ్లే సూచనలు కలవు. దర్శకుడు వంశీ  చివరి చిత్రం మహర్షి గత ఏడాది విడుదలై ఘనవిజయం అందుకుంది. మహేష్ తో వంశీ చిత్రం ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయ్యింది. మహేష్ కొన్ని కారణాల చేత చివరి నిమిషంలో మూవీని హోల్డ్ లో పెట్టారు. అప్పటి నుండి వంశీ మరో హీరోయిని వెతికే పనిలో ఉన్నారు.