ఈ కరోనా రోజుల్లో ఎవరి స్దాయిల్లో వారు రకరకాలుగా ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా హాస్పటిల్ అవసరమైనవాళ్లు, గర్బిణీ స్త్రీలు,పెద్దవాళ్ల కష్టాలు చెప్పనలవి కాదు. చాలా  చోట్ల  లాక్‌డౌన్ గర్భిణిలకు శాపంగా మారింది. కరోనా ఇంపాక్ట్‌తో ఈ మధ్యన  మహిళ రోడ్డుపైనే  ప్రసవం జరిగింది. మొన్న శుక్రవారమే సూర్యపేటలో లాక్‌డౌన్‌ ఎఫెక్ట్‌తో రేష్మా అనే మహిళ నడి రోడ్డుపై ప్రసవించింది. ఆ ఘటన మరువకముందే మరో ఘటన కోయంబత్తూరులోని సింగా నల్లూరులో చోటుచేసుకుంది.  ఈ నేఫధ్యంలో ఈ కరోనా టైమ్స్ లో పురుటి నొప్పులతో బాధ పడుతున్న గర్భిణికి సినీ రచయిత పురుడు పోసి మానవత్వం నిరూపించుకుని, వార్తల్లో నిలిచారు.

వివరాల్లోకి వెళితే... 2015లో తమిళనాడుకు చెందిన చంద్ర కుమార్ అనే ఆటో డ్రైవర్ రాసిన నవల ఆధారంగా ప్రముఖ దర్శకుడు వెట్రిమారన్ తెరకెక్కించిన 'విసారణై' మూవీ చిన్న చిత్రంగా విడుదలై సంచలన విజయాన్ని నమోదు చేసింది. అనేక అవార్డులు రివార్డులతో పాటు నాలుగు జాతీయ అవార్డులను, ఫిల్మ్ ఫేర్ అవార్డ్‌ కొల్లగొట్టి.. ఇండియా నుండి ఆస్కార్‌కి నామినేట్ అయిన చిత్రంగా చరిత్ర సృష్టించింది. ఇక చంద్రన్‌ నివసిస్తున్న కోవై, సింగనల్లూర్‌ ప్రాంతంలో ఒడిశాకు చెందిన భవన నిర్మాణ కార్మికులు కొందరు గుడిసెలు వేసుకుని ఉంటున్నారు. వారిలో నిండు గర్భిణికి పురుటి నొప్పులు రావడంతో ఆమె కుటుంబ సభ్యులు అంబులెన్స్‌కు ఫోన్‌ చేశారు. 

అది రావడం ఆలస్యం కావడంతో ఆటోడ్రైవర్‌ చంద్రన్‌కు ఫోన్‌ చేశారు. ఆయన వెంటనే వచ్చారు. అప్పటికే ఆ మహిళ ప్రసవ వేదనతో బాధపడుతోంది. కరోనా భయంతో ఎవరూ సాయం చేసేందుకు ముందుకు రాలేదు. చంద్రన్‌నే ఆ మహిళకు పురుడు పోసి రియల్‌ హీరో అనిపించుకున్నాడు.