భార్యని వేధింపుల ఘటనలో ఓ సినీ రైటర్‌పై కేసు నమోదైంది. దీంతో ఆ భార్యకి రైటర్‌ చుక్కలు చూపిస్తున్నాడు. నగ్న చిత్రాలు బయటపెడతా నంటూ బెదిరింపులకు దిగుతున్నాడు. సినీ రచయిత యర్రంశెట్టి రమణ గౌతమ్‌పై బంజారాహిల్స్ పోలీస్‌ స్టేషల్‌లో ఈ మేరకు కేసు నమోదు చేశారు. 

ఆ వివరాల్లోకి వెళితే, బంజారాహిల్స్ రోడ్‌ నెం 12లోని ఎన్బీటి నగర్‌లోని ఉండే రచయిత రమణ గౌతమ్‌ అదే ప్రాంతంలో నివసించే ఓ యువతిని ప్రేమించి పెళ్ళి చేసుకున్నారు. ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో గతేడాది జూన్‌లో భర్తపై ఆమె వేధింపులు, మోసం కింద బంజారాహిల్స్ పోలీస్‌ స్టేషల్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసలు కౌన్సిలింగ్‌ ఇవ్వడంతో కలిసి ఉండేందుకు ఇద్దరు అంగీకరించారు. 

కానీ కొన్ని రోజుల నుంచి రమణ గౌతమ్‌ అమెకు దూరంగా ఉంటున్నాడు. ఈ క్రమంలోనే అమెకు ఫోన్స్ చేసి కేసు వాపసు తీసుకోవాలని, లేదంటే ఆమె నగ్న చిత్రాలను యూట్యూబ్‌లో పెడతానంటూ బెదిరింపులకు దిగుతున్నాడని ఆ యువతి సోదరి పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన సోదరి సినీ పరిశ్రమలోనే ఉందని, ఆమె స్నేహితుల వద్ద అసభ్యకరంగా మాట్లాడుతున్నాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.