ప్రముఖ నిర్మాత బన్నీ వాసు, జనసేన పార్టీ తనను మోసం చేసిందంటూ జూనియర్ ఆర్టిస్ సునీత బోయ నిరసనకు దిగిన సంగతి తెలిసిందే. తనను తాను గొలుసులతో బంధించుకుని ఫిల్మ్ చాంబర్‌లో మంగళవారం రాత్రంతా నిరసన తెలిపింది.

దీంతో పోలీసులు బుధవారం ఉదయం ఆమెను అదుపులోకి తీసుకొని కౌన్సెలింగ్ ఇచ్చి విడిచిపెట్టారు.  బయటకు వచ్చిన తర్వాత సోషల్ మీడియాలో సునీత బన్నీ వాసుపై విమర్శలు చేసింది. దీంతో గీతాఆర్ట్స్ సంస్థ ఓ ప్రకటన విడుదల చేసింది. సునీత బోయ పేరు ప్రస్తావించకుండా.. తాము ఎదుర్కొన్న సమస్యని వివరించారు.

ఇప్పుడు బన్నీ వాసు స్వయంగా ఈ వివాదానికి సంబంధించి వీడియో బైట్ విడుదల చేశారు. సునీత బోయ జనసేనలో పని చేశానని, తనకు సినిమాల్లో ఏవైనా అవకాశాలు ఉంటే ఇప్పించాలని తనను సంప్రదించిందని.. దీంతో తనకు తెలిసిన వారికి ఆమె వివరాలు చెప్పి అవకాశాలు ఉంటే చెప్పమన్నట్లు బన్నీ వాసు చెప్పారు.

సినిమాల్లోకి రావాలంటే ఒక ప్రాసెస్ ఉంటుందని.. ఆడిషన్స్ లో పాల్గొని ఎంపికవ్వాలని..  ఆడిషన్స్ పాస్ అయితే కచ్చితంగా తీసుకుంటారని.. చెప్పిన బన్నీ వాసు.. సునీత బోయ ప్రవర్తన కారణంగా తనకు పాత్రలు రాలేదని.. అంతేతప్ప ఇతర కారణాలు లేవని స్పష్టం చేశారు. 

అవకాశాలు ఇస్తామని జనసేన నేతలు... నటి ఆరోపణలు!

బన్నీ వాసుపై ఆరోపణలు, సునీతపై కేసు.. స్పందించిన గీతా ఆర్ట్స్!