Asianet News TeluguAsianet News Telugu

80 కోట్లు పెడదామా వద్దా, డైలమాలో నితిన్?

భారీ బడ్జెట్ లతో సినిమా తీయటం అనేది పెద్ద రిస్క్. నితిన్ స్దాయికి అలాంటి సమస్య ఎప్పుడూ ఎదురుకాలేదు. తన సినిమాల బిజినెస్ తగ్గ స్దాయిలో బడ్జెట్ కేటాయించే కథ లు ఎంచుకుంటూ ఎవరకీ ఏ సమస్యా రాకుండా చూసుకుంటున్నారు. నితిన్ ఫ్లాఫ్ సినిమాలు కూడా పెద్ద నష్టాలు రాకపోవటానికి అదే కారణం. అయితే నితిన్ రీసెంట్ గా ఓకే చేసిన ప్రాజెక్టు విషయంలో మాత్రం అలా చేయగలుగుతారా అనే సందేహం అందరిలో నెలకొంది.

Budget issues for Nithin power peta movie?
Author
Hyderabad, First Published May 11, 2020, 11:31 AM IST

భీష్మ చిత్రంతో హై సక్సెస్ లో ఉన్నాడు నితిన్. దాంతో వరస పెట్టి ప్రాజెక్టులను లైన్ లో పెట్టాడు. అయితే కరోనా ఓ ప్రక్క అన్ని రంగాల మీదా దెబ్బ కొడుతోంది. రాబోయే రోజుల్లో ఎప్పటికి అన్ని పరిస్దితులు సెట్ అయ్యి...థియోటర్స్ ఓపెన్ అవుతాయో తెలియదు. ఓపెన్ చేసినా జనం రెస్పాన్స్ ఎలా ఉంటుందో అసలు తెలియదు. ఈ నేపధ్యంలో భారీ బడ్జెట్ లతో సినిమా తీయటం అనేది పెద్ద రిస్క్. నితిన్ స్దాయికి అలాంటి సమస్య ఎప్పుడూ ఎదురుకాలేదు. తన సినిమాల బిజినెస్ తగ్గ స్దాయిలో బడ్జెట్ కేటాయించే కథ లు ఎంచుకుంటూ ఎవరకీ ఏ సమస్యా రాకుండా చూసుకుంటున్నారు. నితిన్ ఫ్లాఫ్ సినిమాలు కూడా పెద్ద నష్టాలు రాకపోవటానికి అదే కారణం. అయితే నితిన్ రీసెంట్ గా ఓకే చేసిన ప్రాజెక్టు విషయంలో మాత్రం అలా చేయగలుగుతారా అనే సందేహం అందరిలో నెలకొంది.

ఆ ప్రాజెక్టు మరేదో కాదు పవర్ పేట. ‘రౌడీ ఫెల్లో, ఛల్‌ మోహన్‌ రంగ’ సినిమాలతో మంచి టేస్ట్ ఉన్న దర్శకుడిగా పేరు పొందారు పాటల రచయిత కృష్ణ చైతన్య. నితిన్‌ సొంతబ్యానర్‌ శ్రేష్ట్‌ మూవీస్‌పై తాజా చిత్రం రూపొందనుంది. ఈ సినిమాకు ఎనభై కోట్ల దాకా బడ్జెట్ కేటాయించినట్లు సమాచారం. అయితే ఇప్పుడున్న పరిస్దితుల్లో అంత బడ్జెట్ పెట్టడం ఎంతవరకూ సేఫ్ అంటున్నారు. ఎందుకంటే నితిన్ కెరీర్ లో ఎప్పుడూ ఈ స్దాయి సినిమాలు రూపొందలేదు. మారుతున్న కాలం,పెరుగుతున్న ప్రమాణాలకు ఈ బడ్జెట్ సబబే కావచ్చు కానీ...ఇప్పుడు కరోనా టైమ్స్ లో ఇంత బడ్జెట్ అంటే ఖచ్చితంగా ఆచి,తూచి అడుగులు వేయాల్సిందే అని నితిన్ ఆలోచనలో పడినట్లు సమాచారం. అయితే మూడు పార్ట్ లుగా ఈ సినిమా తీస్తారు కాబట్టి...వర్కవుట్ అవుతుందని మరో ప్రక్క ధైర్యం ఉందిట. 

ఇప్పటికే మొదటి భాగం పూర్తి కథను నితిన్‌కు నరేట్‌ చేశారు కృష్ణచైతన్య. మిగతా రెండు పార్ట్స్‌ అవుట్‌లైన్‌ వినిపించారు. చిత్రకథలో హీరో, హీరోయిన్, మిగతా పాత్రలన్నింటికీ కూడా ఒకేలాంటి ప్రాముఖ్యత ఉంటుంది. ఎమోషనల్‌గా సాగే ఈ డ్రామా వచ్చే సంవత్సరం సెట్స్‌ మీదకు వెళ్తుంది’’ అని చెప్తున్నారు. ఇదో మాస్‌ సబ్జెక్ట్‌ అని, ‘పవర్‌ పేట’ అనే టైటిల్‌ కూడా యాప్ట్ అని అంటున్నారు. అదే సమయంలో ‘నా కెరీర్‌లో చాలెంజింగ్‌ సినిమా ఇది’ అని నితిన్‌ ఆల్రెడీ ట్వీటర్‌లో పేర్కొన్న సంగతి తెలిసిందే. తెలుగులో మూడు భాగాలుగా తెరకెక్కబోతోన్న తొలి సినిమా ఇదే కావడం చెప్పుకోదగ్గ విషయం. 

ప్రస్తుతం నితిన్...వెంకీ అట్లూరి దర్శకత్వంలో రంగ్ దే చిత్రాన్ని చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ దాదాపు 70 శాతం పూర్తయింది. ఇది కాకుండా చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో చెక్ చిత్రాన్ని చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ మొదలైంది. కొన్ని నెలల క్రితం బాలీవుడ్ హిట్ మూవీ అంధధూన్ రీమేక్ ను తెలుగులో చేయబోతున్నట్లు ప్రకటించాడు. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో సినిమా ముహూర్తం కూడా జరిగింది.  

Follow Us:
Download App:
  • android
  • ios