బాలీవుడ్‌ డ్రగ్‌ కేసులో దీపికా పదుకొనె పేరు బయటకు వచ్చింది. ఇప్పటికే సారా అలీ ఖాన్‌, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ పేర్లు వెల్లడయ్యాయి. తాజాగా దీపికాతోపాటు శ్రద్ధా కపూర్‌, కరీష్మా పేర్లు బయటకు వచ్చాయి. దీంతో ఇప్పుడు డ్రగ్‌ కేసు బాలీవుడ్‌లో పెద్ద దుమారం రేపుతుంది.

ముఖ్యంగా దీపికా పదుకొనె, శ్రద్ధా కపూర్‌ వంటి టాప్‌ స్టార్స్ పేర్లు బయటకు రావడంతో ఇది మరింతగా హీటెక్కిపోతుంది. త్వరలోనే వీరికి నార్కొటిక్‌ కంట్రోల్‌ బ్యూరో(ఎన్‌సీబీ) సమాన్లు పంపేందుకు సిద్ధమవుతుంది. వీరిని విచారించనున్నారు. 

సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ కేసులో రియా చక్రవర్తి డ్రగ్స్ కేసులో ఇరుక్కుంది. ఆమె చెప్పిన సమాచారం మేరకు డ్రగ్స్ కోణంలో ఎన్‌సీబీ విచారణ జరపగా తాజాగా డ్రగ్స్ కి సంబంధించిన చాటింగ్‌ బయటపడింది. ఇందులో కోడింగ్‌ లాంగ్వేజ్‌లో వారి పేర్లు ఉన్నట్టు తెలుస్తుంది. డి, కె పేర్లు కనిపిస్తున్నాయి. ఇందులో డీ అంటే దీపికా పదుకొనె, కే అంటే కరిష్మా. 

మరోవైపు ఓ ప్రముఖ మీడియా సంస్థ `డీ`, `కే` ల మధ్య జరిగిన చాటింగ్‌ని పంచుకుంది. ఆ ఛాటింగ్‌ ఇదే..

d: k.. maal you have?

k: i have but at home. i am at bandra..

k:i can ask amit if you want

d: yes, please

k: amit has. he is carrying it

d:hash na?

d:not weed

k: what time are you coming to koko

d:11.30/12ish

k:i think she said 11.30 because she needs to it
at the other place at 12

ఈ ఛాటింగ్‌తో `కోకో` అంటే ముంబయిలోని కమలా మిల్స్ ప్రాంతంలో ఉన్న రెస్టారెంట్‌ `కోకో` అని తెలుస్తుంది. ఈ ఛాటింగ్‌ సైతం ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. దీంతో `బైకాట్‌ దీపికాపదుకొనె` నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. ఓ రకంగా ఇప్పుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ కేసు మరింత దుమారం క్రియేట్‌ చేస్తుందని చెప్పొచ్చు. 

అయితే దీపికా పదుకొనె పేరు విని ఆమె అభిమానులు పెద్ద షాక్‌కి గురయ్యారు. అంతేకాదు ఆమెపై పూర్తిగా అభిప్రాయం మారిపోయిందంటున్నారు. ఈ మేరకు ఆమెని ట్విట్టర్‌ వేదికగా ట్రోలింగ్‌ చేస్తున్నారు.  దీపికాపై నెటిజన్లు, అభిమానుల కామెంట్లతో ట్వీట్టర్‌ ఊగిపోతుంది.  సోషల్‌ మీడియా మొత్తం షేక్‌ అవుతుంది. మరి ఇది మున్ముందు ఇంకెన్ని కొత్త కోణాలను, కొత్త వారిని బయటకు తీసుకొస్తుందో చూడాలి.