సింహా, లెజండ్ చిత్రాల తరువాత బోయపాటి, బాలకృష్ణ కాంబినేషన్‌లో మూడో మూవీ తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. లాక్‌డౌన్‌కి ముందే ఈ మూవీ షూటింగ్ ప్రారంభం కాగా.. ఆ మధ్య బాలయ్య పుట్టినరోజు సందర్భంగా వచ్చిన టీజర్ అభిమానులను చాలా ఆకట్టుకుంది. ఇక ఈ చిత్రం షూటింగ్ కరోనాతో ఆగిపోయింది. అయితే దసరా తర్వాత షూటింగ్ మొదలెట్టాలని బాలయ్య,బోయపాటి భావిస్తున్నారట. ఈ నేపధ్యంలో ఈ చిత్రం కోసం లొకేషన్స్ ఎంపిక మొదలైంది.

అందుతున్న సమాచారం మేరకు...ఈ సినిమా షూటింగ్  కోసం ఓ ఇల్లుని వెతుకుతున్నారట. అది హైదరాబాద్ అవుట్ స్కర్ట్స్ లో ఉండాలి. షూటింగ్ లకు అనువుగా ఉండాలి. అలాగే అది పురాతనగా కనిపించాలి. అంటే దాదాపు అదొక పురాతన భవంతిలా ఉండాలన్నమాట. ఎంత రేటు ఇచ్చి అయినా అద్దెకు తీసుకుందామని టీమ్ ఫిక్స్ అయ్యారట. మినిమం ఇరవై ఐదు రోజులు అక్కడ షూట్ జరగనుందిట. 

ఇలాంటి అరుదైన ఇంటి కోసం బోయపాటి తన టీమ్ తో వెతుకున్నారట. ఆల్రెడీ షూటింగ్ లు చేసినవి వద్దనుకుంటన్నారట. ఏదీ దొరక్కపోతే సెట్ వేస్తాము కానీ కాంప్రమైజ్ కామంటున్నారు. కీలకమైన సీన్స్ అన్ని అక్కడే తీయాలట. ఇది ఫైనలైజ్ అయితే వారణాసి వెళ్లి తీయాల్సిన సీన్స్ పెండింగ్ ఉన్నాయి. 

ఇదిలా ఉంటే ఈ మూవీ ద్వారా ఓ కొత్త హీరోయిన్‌ని పరిచయం చేయబోతున్నట్లు ఇప్పటికే బోయపాటి వెల్లడించారు. కాగా తాజా సమాచారం ప్రకారం ఈ మూవీలో ఒక కీలక పాత్ర కోసం అల్లరి నరేష్‌ను సంప్రదించినట్లు తెలుస్తోంది.

ఇందులో ఫ్లాష్‌బ్యాక్‌ ఎపిసోడ్‌లో ఓ కీలకమైన పాత్ర ఉందట. ఆ పాత్రకు గానూ అంతకుముందు నవీన్ చంద్ర పేరు వినిపించింది. ఇక ఇప్పుడు అల్లరి నరేష్‌ని అడిగినట్లు సమాచారం. అంతేకాదు ఆ పాత్ర అల్లరోడికి నచ్చిందని టాక్.