బాలయ్య తన మనస్సులో ఏది ఫిక్సైతే అదే బ్లైండ్ గా ఫాలో అయిపోతూ వెళ్ళిపోతారు.అలాగే సెట్లో బాలయ్యకు ఎదురు చెప్పేవారు కూడా ఉండరు. దాంతో బాలయ్య సీన్ లో ఉన్నారంటే ఓ రకమైన వాతావణం క్రియేట్ అవుతుంది. క్రమశిక్షణ,భయం అక్కడ రాజ్యం ఏలతాయి. అది నిర్మాతలకు ఆనందం కలిగించే విషయం. డైరక్టర్స్ కు రిస్ట్రిక్టడ్ గా ఉంటుంది. అయితే ఆయనతో అలవాటు పడిన వాళ్లకు అందులో ఆనందం తెలుస్తోంది. ఏ సమస్యలూ లేకుండా షూటింగ్ జరుగుతూంటుంది. 

ఇక ప్రస్తుతం ఆయన తన తాజా చిత్రం విషయంలో కొన్ని డెసిషన్స్ తీసుకున్నారట. వాటిని ఆయన ఫాలో అవటం సెట్ లో కంగారు పుట్టిస్తోందిట. ముఖ్యంగా దర్శకుడు బోయపాటి శ్రీను విషయంలో బాలయ్య చాలా ఖచ్చితంగా ఉంటున్నాడట. సెట్ లో కొంచెం కూడా టైమ్ వేస్ట్ చేయటానికి వీల్లేదని, సీన్స్ చెక్కద్దని చెప్తున్నారట. షాట్ మేకింగ్ విషయంలో చాలా స్పీడుగా ఇనస్ట్రక్షన్స్ ఇస్తున్నాడట. అది విన్న బోయపాటికి ఏం చెయ్యాలో అర్దం కాని సిట్యువేషన్ లో ఉన్నాడని అంటున్నారు. 

అలాగే బడ్జెట్ లిమిటేషన్స్ సైతం బోయపాటిని బాగా నిరాసపరుస్తున్నాయట. తన కమ్ బ్యాక్ మూవి విషయంలో బోయపాటి కొన్ని ఆలోచనలు కలిగి ఉన్నాడని,అందుకోసం డబ్బుని నీళ్లలా ఖర్చుపెట్టే సీన్స్ అనుకున్నారట. కానీ అవేమీ కుదరకపోవటంతో..ఫైనల్ అవుట్ ఫుట్ ఎలా వస్తుందో అని కంగారుపడుతున్నట్లు చెప్తున్నారు.