తమిళ నటులకు బాంబ్‌ బెదిరింపులు పెద్ద తలనొప్పిగా మారాయి. వరుసగా ఆఫీస్‌లకు, ఇళ్ళకు బాంబ్‌లు పెట్టామని అజ్ఞాత ఫోన్ కాల్స్ వచ్చి ఇబ్బంది పెడుతున్నాయి. ఆ మధ్య రజనీకాంత్‌ ఇంటికి బాంబ్‌ బెదిరింపు ఫోన్ వచ్చి కలకలం సృష్టించింది. పోలీసులు చెక్‌ చేయగా, అది ఫేక్‌ కాల్‌ అని స్పష్టమైంది.

అజిత్‌, విజయ్‌ హీరోలకూ, అలాగే దర్శకుడు మణిరత్నంకి సైతం ఇలాంటి బెదిరింపు కాల్సే వచ్చాయి. తాజాగా హీరో సూర్యకి బెదిరింపు కాల్‌ వచ్చింది. తన ఆఫీస్‌కి బాంబ్‌ పెట్టినట్టు రాంగ్‌ ఫోన్‌ కాల్‌ వచ్చింది. దీంతో హుటాహుటిన పోలీసులు చెన్నైలోని అల్వార్‌పేట సమీపంలో ఉన్న సూర్య ఆఫీస్‌ని చెక్ చేశారు. కానీ ఎలాంటి బాంబు కనిపించలేదు. దీంతో ఇది కూడా ఫేక్‌ కాల్‌ అని పోలీసులు తేల్చుకున్నారు.

అయితే వరుసగా హీరోలను టార్గెట్‌ చేసుకుని ఇలాంటి రాంగ్‌ బెదిరింపు కాల్స్ పై పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు. ఇకపై ఇలాంటి రాంగ్‌ కాల్‌ చేసే వారిని వెంటనే గుర్తించి వారి పని పట్టాలని నిర్ణయించినట్టు తెలుస్తుంది. మరి ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్న వారిపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి.