ఇద్దరు సూపర్ స్టార్లు ఒకే ఫ్రేమ్ లో!

bollywood zero movie teaser talk
Highlights

షారుఖ్ ఖాన్ మరుగుజ్జు పాత్రలో నటిస్తోన్న చిత్రం 'జీరో'. ఆనంద్ రాయ్ రూపొందిస్తోన్న ఈ సినిమాలో 

షారుఖ్ ఖాన్ మరుగుజ్జు పాత్రలో నటిస్తోన్న చిత్రం 'జీరో'. ఆనంద్ రాయ్ రూపొందిస్తోన్న ఈ సినిమాలో కత్రినా కైఫ్, అనుష్క శర్మ హీరోయిన్లుగా కనిపించనున్నారు. ఈ ఏడాది డిసంబర్ లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుందని సమాచారం.

ఇప్పటికే మరుగుజ్జు పాత్రలో షారుఖ్ కు సంబంధించిన ఫోటోలు ఇంటర్నెట్ లో చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా ఈద్ సందర్భంగా ఈ సినిమా టీజర్ ను విడుదల చేసింది చిత్రబృందం. ఇందులో సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్ ఇద్దరు సూపర్ స్టార్లు ఒకే ఫ్రేమ్ లో కనిపించడం అభిమానులకు ఆనందాన్ని కలిగిస్తోంది. చివరి ఫ్రేమ్ లో షారుఖ్ ను సల్మాన్ ఎత్తుకోవడం హైలైట్ గా నిలిచింది. ఆ టీజర్ ఎలా ఉందో మీరు కూడా చూసేయండి!
 

loader