బాలీవుడ్ కాంట్రవర్షల్ సెక్స్ బాంబ్ రాఖీ సావంత్ బాలీవుడ్ పోర్న్ స్టార్ సన్నీ లియోన్ మీద పలుసార్లు కామెంట్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఆమె సన్నీ లియోన్ మీద సీరియస్ ఆరోపణలు చేసింది. సన్నీ లియోన్ నా పోన్ నెంబర్ లాస్ ఏంజిల్స్‌లోని అడల్ట్ ఫిల్మ్ ఇండస్ట్రీకి ఇచ్చిందని, వారి నుండి తనకు కాల్స్ వస్తున్నాయని, బూతు సినిమాల్లో నటించాలని వారు తనను ఫోన్లో వేధిస్తున్నారంటూ రాకీ సావంత్ ఆరోపించారు.

 

ఓ ప్రముఖ ఆంగ్ల పత్రికతో రాఖీ సావంత్ మాట్లాడుతూ....తనకు అడల్ట్ ఫిల్మ్ ఇండస్ట్రీ నుండి ఫోన్ కాల్స్, మెసేజ్‌లు వస్తున్నాయని, తనకు సంబంధించిన వీడియోలు, మెడికల్ సర్టిఫికెట్స్ అడుగుతున్నారని రాఖీ సావంత్ తెలిపారు. అడల్ట్ ఫిల్మ్ ఇండస్ట్రీతో సంబంధం ఉన్న ఏకైక వ్యక్తి సన్నీ లియోన్ మాత్రమే. నా మీద కక్షతో నా ఫోన్ నెంబర్ వారికి అందించింది. వారి నుండి రోజూ ఫోన్ కాల్స్, సందేశాలు వస్తున్నాయని రాఖీ సావంత్ తెలిపారు.

 

నాకు ఫోన్లు చేసిన వారు చాలా డబ్బు ఆఫర్ చేస్తున్నారు. కానీ నాకు అలాంటి సినిమాల్లో నటించడం ఇష్టం లేదు. ఎన్ని సార్లు చప్పినా వారు వినిపించుకోవడం లేదు, నాకు ఫోన్లు చేస్తూనే ఉన్నారు అని రాఖీ సావంత్ తెలిపారు. నేను చావడానికైనా సిద్ధమే కానీ, అడల్ట్ సినిమా ఇండస్ట్రీలోకి వెళ్లడానికి తాను సిద్ధంగా లేను అని రాఖీ సావంత్ తెలిపారు. నేను భారతీయ మహిళను, నా వ్యాల్యూస్ నాకు తెలుసు అని రాఖీ సావంత్ అన్నారు.

 

ఇటీవల నేను సన్నీ లియోన్‌ దంపతులు సరోగసీ ద్వారా ఇద్దరు కవలలకు జన్మినచ్చారు. దీనిపై ఆమెను విష్ చేస్తూ ఓ వీడియో పోస్టు చేశాను. అపుడు గుర్తు తెలియని నెంబర్ నుండి సన్నీ నాకు ఫోన్ చేసింది, నన్ను చూసి ఈర్ష పడుతున్నావా? అని అడిగింది. నేనెందుకు జలస్ ఫీలవుతాను? నేను బాలీవుడ్లో ఎంతో మంచి పాత్రలు పోషించాను. మా కుటుంబం పట్ల ప్రజలకు ఎంతో గౌరవం ఉంది' అని రాఖీ సావంత్ తెలిపారు.

 

తనకు అడల్ట్ ఫిల్మ్ ఇండస్ట్రీ నుండి ఫోన్ కాల్స్ వచ్చాయనే విషయాన్ని రుజువు చేస్తూ కొన్ని స్క్రీన్ షాట్స్ కూడా రాఖీ సావంత్ మీడియాకు చూపించారు. మరి రాఖీ సావంత్ ఆరోపణలపై సన్నీ లియోన్ ఎలా స్పందిస్తారో చూడాలి.