డ్రగ్స్ కేసులో బాలీవుడ్ లో ప్రకంపనలు రేపింది. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ డెత్ కేసుతో మొదలైన విచారణ డ్రగ్స్ కోణం తీసుకుంది. ఈ కేసులో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మాజీ లవర్ రియా చక్రవర్తి అరెస్ట్ కావడం జరిగింది. ఆమె తమ్ముడు షోవిక్ కూడా అరెస్ట్ కాబడ్డారు.   ఈ కేసులో దీపికా పదుకొనె, రకుల్ ప్రీతీ సింగ్, సారా అలీఖాన్ మరియు శ్రద్దా కపూర్ లను నార్కోటిక్ అధికారులు విచారించారు. 

కొందరు డ్రగ్స్ పెడ్లర్స్ తో సంబంధాలు కలిగి ఉండడంతో పాటు, ప్రైవేట్ పార్టీలలో డ్రగ్స్ వాడారంటూ వీరిపై ఆరోపణలు వచ్చాయి. బాలీవుడ్ ఈ కేసు సద్దుమణుగుతుంది అనుకుంటున్న సమయంలో మరో ప్రముఖ వ్యక్తి అరెస్ట్ కావడం జరిగింది. 

బాలీవుడ్‌  నిర్మాత ఫిరోజ్‌ నడియాడ్‌వాలా భార్య షబానా సయీద్‌ను ఎన్సీబీ అరెస్టుచేసింది.  ఎన్సీపీ జోనల్‌ డైరెక్టర్‌ సమీర్‌ వాంఖేడే  షబానాను అరెస్ట్ చేసినట్లు మీడియా ముఖంగా తెలియజేశారు. . ఫిరోజ్‌ భార్య షబానాను నార్కోటిక్‌ డ్రగ్స్‌ అండ్‌ సైకోట్రోపిక్‌ సబ్‌స్టాన్సెస్‌ ‌చట్టం కింద అరెస్టు చేశామని, తదుపరి దర్యాప్తు కొనసాగుతుందని చెప్పారు. సబర్బన్‌లో జూహూలోని తన నివాసంలో 10 గ్రాముల గంజాయి దొరకడంతో ఎన్సీబీ ఆమెను విచారణకు పిలిచి, అరెస్టు చేసింది. కాగా, ఫిరోజ్‌ను సైతం ఎన్సీపీ విచారణకు పిలవగా ఆయన హాజరుకాలేదు.